Thyroid Issues Impact on Intimate Health : థైరాయిడ్ సమస్యలను స్త్రీలలో ఎక్కువగా చూస్తాము. అయితే ఇది లైంగిక జీవితంపై ప్రభావం చూపిస్తుందా? అనే ప్రశ్నకు.. అవుననే సమాధానం ఇస్తున్నారు నిపుణులు. అంటే థైరాయిడ్​తో ఇబ్బందులు పడుతున్నవారిలో లైంగిక డ్రైవ్, లిబిడో సామర్థ్యం దెబ్బతింటుందట. దీని ప్రభావం కేవలం ఆడవారికేనా? మగవారిలో కూడా ఉంటుందా? ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


థైరాయిడ్​ గ్రంథి శరీరంలోని ప్రతి కణం శక్తిని ఉపయోగించే విధానాన్ని నియంత్రిస్తుంది. దానివల్ల ఇది లైంగికంగా కూడా సమస్యలు తీసుకువస్తుందట. థైరాయిడ్ సమస్యలు నేరుగా లైంగిక హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయని సెక్సువల్ మెడిసిన రివ్యూస్ జర్నల్​లో రాసుకొచ్చారు. ఇది ఆ కోరికల్లో మార్పులు తెచ్చి.. ఆడ, మగవారిలో లైంగిక పనితీరును దెబ్బతీస్తుందని తెలిపారు. హైపో థైరాయిడిజంలో, హైపర్ థైరాయిడిజంలో వివిధ రకాల మార్పులు తీసుకువస్తుందట. అవేంటంటే.. 


హైపో థైరాయిడిజంలో.. 


దీనినే అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. ఇది ఉన్నవారిలో లిబిడో తగ్గుతుంది. థైరాయిడ్ హార్మోన్​ స్థాయిలు తగ్గడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. త్వరగా అలసిపోయేలా చేస్తుంది. లైంగిక కోరికలను దూరం చేస్తుంది. పొడి చర్మం, జుట్టురాలడం వంటి సమస్యలు ఎక్కువై.. ఇన్​సెక్యూరిటీని క్రియేట్ చేస్తాయి.



డిప్రెషన్, ఆందోళన, మూడ్ స్వింగ్​లు శరీరంలోని లిబిడోను తగ్గిస్తాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు ప్రభావితం చేసి.. ప్రశాంతతను దూరం చేస్తాయి. హైపోథైరాయిడిజం పీరియడ్స్‌ను ఇర్​రెగ్యూలర్ చేస్తుంది. సంతానోత్పత్తి, లిబిడోను ప్రభావితం చేస్తుంది.


హైపర్ థైరాయిడిజం ఉంటే..


దీనిని ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో థైరాయిడ్ హార్మోన్లు లిబిడోను పెంచుతాయి. దీనివల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే అలసట, ఆందోళన, లిబిడోను తగ్గేలా చేస్తుంది. అంటే ముందు కోరికలను పెంచి.. తర్వాత దానిని పూర్తిగా దూరం చేస్తుందట. ఆందోళన, స్ట్రెస్, చిరాకు వంటి మూడ్ స్వింగ్​లు సెక్స్ డ్రైవ్​ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. నిద్ర సమస్యలు ఎక్కువై లిబిడో తగ్గిపోతుంది. 


మీరు థైరాయిడ్ వల్ల ఈ తరహా సమస్యలను ఎదుర్కొంటుంటే.. వెంటనే వైద్యుల సలహా తీసుకోండి. వారు ఇచ్చే సూచనలు, మందులను రెగ్యూలర్​గా ఉపయోగిస్తే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. లిబిడో సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలు రెగ్యూలర్​గా చేయాలి. ఫుడ్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల థైరాయిడ్ కంట్రోల్​లో ఉంటుంది. ఇది లిబిడోపై కూడా ప్రభావం చూపిస్తుంది. స్మోక్ చేయడం, మద్యం సేవించడం, అన్ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం తగ్గిస్తే.. థైరాయిడ్ అదుపులో ఉంటుంది.



Also Read : అమ్మాయిలు రాత్రుళ్లు లేట్​గా పడుకుంటున్నారా? అయితే మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టమేనట









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.