వర్షాకాలం వచ్చిందంటే జ్వరాల సీజన్ వచ్చినట్టే. రుతుపవనాలతో పాటు డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతూ ఉంటుంది. డెంగ్యూ బారిన పడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా ఈ బాక్టీరియా రక్తంలోని ప్లేట్లెట్లను నాశనం చేస్తుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య కొన్ని గంటల్లోనే తగ్గిపోతూ ఉంటుంది. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతే చాలా ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి.  అయితే రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి బొప్పాయి ఆకుల రసం సాయపడతాయని అంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.


బొప్పాయి ఒక ఉష్ణ మండల పండు. నిజానికి ఇది అన్ని కాలాల్లోనే పండుతుంది. వేసవి కాలంలో అధికంగా పండుతుంది. అయితే దీనిలో ఎన్నో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి కంటెంట్ కూడా అధికమే. అందుకే బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే డెంగ్యూ వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కూడా శరీరానికి ఇస్తుంది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్లే జ్వరం వంటి సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇక బొప్పాయి ఆకులలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. డెంగ్యూ బారిన పడినప్పుడు ఆకుల రసాన్ని తీసి తాగాలి. ఇదే ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ను కూడా ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది. డెంగ్యూ రావడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య పదివేల కంటే తక్కువగా సంఖ్యకు పడిపోతాయి. అలాంటి సమయంలో బొప్పాయి ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు.


అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి. అయితే ఆ అధ్యయనాలు బొప్పాయి ఆకుల్లోని రసానికి, ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడానికి మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని మాత్రం కనుగొనలేకపోయాయి. వివిధ దేశాల్లో చేసిన తొమ్మిది అధ్యయనాలు బొప్పాయి ఆకులను తినడం వల్ల,వాటి ఆకుల రసాన్ని తాగడం వల్ల ఉపయోగం ఉంటుందని చెబుతున్నాయి. బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఇది ఇనుము లోపాన్ని తగ్గిస్తుంది. అందుకే ఇనుము లోపం ఉన్న వారు కచ్చితంగా బొప్పాయి ఆకుల రసాన్ని తాగాలి.  బొప్పాయి పండు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 


Also read: వారిద్దరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, ఆయనతో కలిసి ఉండలేకపోతున్నా



Also read: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న ర్యాట్ ఫీవర్ కేసులు, ఈ జ్వరం ఎవరికైనా రావచ్చు - లక్షణాలు ఇవే


















































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.