తులసిని చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇది కేవలం సాధారణ మొక్కగా పవిత్రమైంది మాత్రమే కాదు ఒక ఔషధ మూలిక కూడా. తులసి శాస్త్రీయ నామం ఆసిమమ్ టెనుప్లోరమ్. ఇది లామియాసి కుటుంబానికి చెందిన మొక్క. తులసి భారత ఉపఖండానికి చెందినది. మన దేశంలో తులసి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన మొక్క. ఆయుర్వేదంలో తులసి చాలా ఔషధగుణాలు కలిగి ఉంటుంది. తులసి అడాప్టోజెనిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటి ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునోమోడ్యులేటరీ ప్రభావాలన్ని కలిగి ఉంది.  తులసిని వివిధ రకాలుగా ఔసధ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. ఎన్ని రకాలుగా తులసి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.


తులసి టి


తాజా ఆకులు లేదా ఎండిన ఆకుల పొడిని వేడి నీటిలో వేసి టీ తయారు చెయ్యాలి. ఇది చాలా రిఫ్రెష్షింగ్ గా ఉండే టీ. ఒక కప్పు వేడి నీటికి 1-2 టీస్పూన్ల తులసి ఆకులు వేసి 10-15 నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత వడకట్టి తాగాలి. తులసి టీ ప్రశాంతత నిస్తుంది. రోగనిరోదక శక్తిని పెంచుతుంది.


తులసి కలిపిన నీరు


కొన్ని తాజా తులసి ఆకులు లేదా తులసి పొడిని ఒక కూజా నీటిలో వేసి రాత్రాంతా మూత పెట్టి ఉంచెయ్యాలి. తెల్లవారి రోజంతా కూడా ఆ నీటిని తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది.        


తులసి ఆకులు


రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రతి రోజూ 2,3 తులసి ఆకులు పరిగడుపున నమలాలి. తులసి ఆకులకు రుచిని పెంచేందుకు వంటలో కూడా ఉపయోగించవచ్చు.


తులసి క్యాప్సూల్స్, సప్లిమెంట్లు


తులసి క్యాప్సూల్స్ రూపంలో మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ప్యాక్ మీద ఉన్న సూచనలను అనుసరించి వీటిని తీసుకోవచ్చు. లేదా ఇవి వాడేందుకు నిపుణుల సూచనలు కూడా తీసుకోవచ్చు.


ఆయుర్వేద ఫార్ములాలు


తులసిని రకరకాల ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.  ఈ ఔషదాలలో తులసి తో పాటు ఇతర ఔషధాలు కూడా కలిపి ఉంటాయి. ఏ రకమైన అనారోగ్యానికి ఈ మందును ఉపయోగిస్తారనే దాన్ని బట్టి ఆయా మూలికలతో తులసిని కలిపి తయారుచేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయుర్వేద నిపుణులు అందించగలుగుతారు. సాంస్కృతిక ప్రాధాన్యత, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తులసి ని దక్షిణాసియా లోని అనేక ప్రాంతాలలో సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు.


ప్రతి హిందూ ఇంటిలోనూ తప్పకుండా పూజలందుకునే మొక్క తులసి. సాక్ష్యాత్తు లక్ష్మీ స్వరూపంగా బావిస్తారు. తులసీదళం విష్ణువు కు అత్యంత ప్రీతిపాత్రమైంది. తులసి ఆకులను విష్ణు ఆరాధనలో తప్పకుండా వాడుతారు. కనుక అత్యంత విలువైన మొక్కగా తులసిని భావిస్తారు.


Also read : వయస్సు పెరిగినా, యవ్వనంగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ నాలుగు మీ కోసమే!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.