Stock Market Today, 30 June 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 31 పాయింట్లు లేదా 0.16 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,181 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


HDFC లైఫ్: ప్రమోటర్ కంపెనీ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ (HDFC), తన అనుబంధ సంస్థ HDFC లైఫ్‌లో 0.77% వాటాను బుధవారం బల్క్ డీల్స్ ద్వారా కొనుగోలు చేసింది.


అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్ టెక్: ప్రమోటర్ ఎంటిటీ అడ్వాన్స్‌డ్ వైటల్ ఎంజైమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్‌లో కొంత స్టేక్‌ను బుధవారం బల్క్ డీల్స్ ద్వారా అమ్మేసింది.


TCS: రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఆరుగురు ఉద్యోగులను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంటికి పంపింది, ఆరు బిజినెస్‌ అసోసియేట్‌ సంస్థలపై నిషేధం విధించింది.


ICICI సెక్యూరిటీస్: త్వరలో డీలిస్టింగ్ తర్వాత, తన పేరెంట్‌ కంపెనీ ICICI బ్యాంక్‌కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మారతామని ICICI సెక్యూరిటీస్‌ ప్రకటించింది.


BPCL: అర్హులైన వాటాదార్లకు రైట్స్‌ ఇష్యూ చేసి రూ. 18,000 కోట్ల వరకు సమీకరించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) బోర్డు ఆమోదం పొందింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: రూ.4,140 కోట్ల బల్క్ డీల్‌ ద్వారా, ఎస్‌బీ అదానీ ఫ్యామిలీ ట్రస్ట్ 1.8 కోట్ల అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను ఒక్కొక్కటి రూ. 2,300 చొప్పున విక్రయించింది.


SBI లైఫ్: కంపెనీ MD & CEOగా మహేష్ కుమార్ శర్మను తిరిగి నియమించడానికి SBI లైఫ్ బోర్డ్ ఆమోదించింది.


పవర్ గ్రిడ్: రూ.300 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన మూడు ప్రతిపాదనలను పవర్ గ్రిడ్ డైరెక్టర్ల కమిటీ ఓకే చేసింది.


కెనరా బ్యాంక్: రూ. 3500 కోట్లు, రూ. 4000 కోట్ల విలువైన బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలన్న రెండు ప్రపోజల్స్‌కు బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


టాటా కమ్యూనికేషన్స్: USకు చెందిన ఎంటర్‌ప్రైజ్ మెసేజింగ్ సంస్థ 'కలేరా'ను ఆల్‌ క్యాష్‌ డీల్‌ ద్వారా USD 100 మిలియన్లకు టాటా కమ్యూనికేషన్స్‌ కొనుగోలు చేస్తుంది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: ఈ నెల 27న కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనన్‌కు (CIRP) ఫైల్‌ చేసిన EOIని ఈ కంపెనీ వెనక్కు తీసుకుంది.


దాల్మియా భారత్ షుగర్: దాల్మియా భారత్ షుగర్ (డిమెర్జ్‌డ్‌ కంపెనీ), దాల్మియా భారత్ రిఫ్రాక్టరీస్ (మెర్జ్‌డ్‌ కంపెనీ) మధ్య అరేంజ్‌మెంట్స్‌ స్కీమ్‌కు ఏర్పాటుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం, షేర్‌హోల్డర్లకు, దాల్మియా భారత్ షుగర్‌లో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 39 షేర్లకు, దాల్మియా భారత్ రిఫ్రాక్టరీస్‌లో 1 ఈక్విటీ షేర్ జారీ చేస్తారు.


ఇది కూడా చదవండి: బంగారం రేటు భారీగా తగ్గింది, పెట్టుబడి పెట్టేందుకు చాలా ఆప్షన్స్‌! 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial