పెరుగుతున్న వయసుపై అందరికీ బెంగగానే ఉంటుంది. ముసలితనం అందరికీ శాపంగా, భయం గొలిపేదిగానే అనిపిస్తుంది. కానీ అది తప్పదని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే వృద్ధాప్యాన్నితప్పించుకునే దిశగా ప్రపంచవ్యాప్తంగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. యవ్వనాన్ని పొడిగించేందుకు సాగుతున్న ఈ పరిశోధనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గత ఫిబ్రవరిలో కాలిఫోర్నియా స్టార్టప్ యువన్ రీసెర్చ్ లో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హెరాల్డ్ కాచర్, అతని బృందం ల్యాబ్ లో ఎలుక జీవితాన్ని 47 నెలల వరకు పొడిగించారు. ఇది ఇదివరకు రికార్డ్ చేసిన ఇతర ఎలుకల ఆయుష్షు కంటే ఆరునెలలు ఎక్కువ. ఇలా ఆయుష్షు పెంచేందుకు వయసు తక్కువగా ఉన్న ఎలుక నుంచి రక్తంలోని ప్లాస్మా ఇన్ఫ్యూజ్ చేసి ఈ ఫలితాలను సాధించారు. వయస్సు పెరిగినా, యవ్వనంగా ఉండాలని కోరుకొనేవారు.. తప్పకుండా ఈ నాలుగు ప్రయోగాల గురించి తెలుసుకోవల్సిందే.
బ్లడ్ ప్లాస్మా స్వాపింగ్
యువకుల నుంచి.. పెద్దవారికి రక్త మార్పిడి వంటి ప్రయోగాలు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ.. వ్యక్తి జీవితకాలాన్ని పొడిగించడం కోసం కాదు, యవ్వనాన్ని పొడిగించేందుకు మాత్రమేనని నిపుణులు తెలుపుతున్నారు. జీవితంలోని స్వర్ణయుగం యవ్వనం. ఈ కాలం మరింత ఎక్కువ కాలం ఉండేందుకు, మరిన్ని ఆనందదాయక సంవత్సరాలను జోడించడానికి మాత్రమేనని చెబుతున్నారు.
బ్రయన్ జాన్సన్ అనే 45 ఏళ్ల సంపన్నుడు కేవలం ఎలుకల్లో జరిపిన ఈ ప్రయోగాన్ని గురించి తెలుసుకుని.. శాశ్వత యవ్వనాన్ని సాధించేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన 17 ఏళ్ల కొడుకు రక్తంలోని ప్లాస్మను తన రక్తంలోకి మార్పిడి చేసుకున్నాడు. అయితే, ఫలితం తెలుసుకోడానికి కొన్నాళ్లు వేచి చూడాలి.
రెజువనేషన్
అమెరికా సిలికాన్ వ్యాలి, కెంబ్రిడ్జి శాస్త్రవేత్తలు వృద్ధాప్యం వల్ల దెబ్బతిన్న కణాల పునరుత్పత్తి కోసం మూల కణాలను పరిశోధిస్తున్నట్టు చెబుతున్నారు. రోగాలను తగ్గించి, కణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు.. సెల్ల్యూలార్ రెజువనేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. దీని ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల వైకల్యాలను సరిచేసే దిశగా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. కానీ కచ్చితంగా వారు దేన్ని అభివృద్ది చేస్తున్నారో వివరించలేకపోతున్నారు. ఇప్పటికైతే ఇదొక మిస్టరీగానే ఉంది.
సెల్ ఫ్లష్షింగ్
వృద్ధాప్యం వల్ల దెబ్బతిన్న కణాలు.. వయసు పెరిగిన ఛాయలకు, వ్యాధులకు కారణం అవుతాయి. ఈ కణాలను పరిశోధించేందుకు చేసే ప్రయోగాలకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ పెట్టుబడి పెట్టారు. వీటిని స్టార్ట్ అప్ యూనిటీ బయోటెక్నాలజీ వారు నిర్వహిస్తున్నారు.
యూఎస్ లోని మిన్నెసోటాలో మయోక్లినిక్ మందులు వాడడం వల్ల ఎలుకల జీవిత కాలం పెరిగినట్టు నిరూపితమైంది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించి ఎడిన్ బర్గ్ యూనివర్సిటి నిపుణులు వృద్ధాప్యానికి కారణమయ్యే సెనెసెంట్ కణాలను ఎదుర్కోగల మూడు కాంపౌండ్స్ ను గుర్తించారు. ఇలా రకరకాల ప్రయోగాలను మనల్ని యంగ్‌గా ఉంచేందుకు కొనసాగుతున్నాయి. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా.. అది అద్భుతమే.
Also read : GAS stove: గ్యాస్ స్టవ్ వాడుతున్నారా? కంటికి కనిపించని ఈ ప్రమాదాన్ని మీరు ఊహించి ఉండరు!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.