యూఎస్ మోంట్‌గోమెరీ కౌంటీ, మేరీల్యాండ్ లో ఓ ఇంట్లో పాములు కలకలంరేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పాములు పట్టేవారిని పిలిచి వాటిని పట్టించి దూరంగా విడిచిపెడతారు. కానీ ఆ ఇంటి యజమాని ఓ విపరీత ఆలోచన చేశాడు.  పొగపెట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. ఎంతసేపటికీ  పాములు బెడద తగ్గకపోవడంతో డోస్ పెంచాడు. దీంతో  ప్రమాదవశాత్తూ ఏకంగా ఇల్లంతా మంటలు చెలరేగాయి.






ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మోంట్‌గోమేరీ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్, కాలిపోయిన ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆస్తి నష్టం మిలియన్ కన్నా ఎక్కువ ఉండొచ్చని అంచనా. 


2018లో ఓ వ్యక్తి తన ఇంట్లో ఎక్కడంటే అక్కడ కనిపించే సాలె పురుగులను చంపేందుకు  ప్రొపేన్ బ్లోటోర్చ్‌ని ఉపయోగించాడు. ఆ మంటలు అదుపుతప్పి ఏకంగా ఇల్లు కాలిపోయింది. నాలుగు నెలల క్రితం ఓ భర్త తన భార్యకు వాటా రాకూడదనే కక్షతో ఇంటికి నిప్పుపెట్టాడు. ఏదేమైనా పాముల బెడదనుంచి బయటపడేందుకు పొగపెట్టి ఇల్లు కాలిపోయిన ఘటన తాలూక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే
Also Read:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Also Read: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...


Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Read also:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి