మీ రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? అంటే మీ శరీరంలో రక్త కణాలను నిర్మించేందుకు ఉపయోగపడే కొవ్వు అవసరానికి మించి ఉందని అర్థం. ఇలా కొవ్వు పేరుకుపోతే రక్తనాళాలు మూసుకుపోతాయి. ఫలితంగా గుండె మీద ఎక్కువ భారం పడి గుండె జబ్బులకు కారణం కావచ్చు, మెదడుకు తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.


కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించేందుకు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల పానీయాలు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయని న్యూట్రిషనిష్టులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రకాల పానీయాల గురించి మేస్ అల్ అలీ అనే న్యూట్రిషనిస్ట్ వివరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.


రెండు రకాల పానీయాలు శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.



  • గ్రీన్ టీ

  • మందార టీ


గ్రీన్ టీ.. LDL కొలెస్ట్రాల్‌ను పెంచే సీరం లిపిడ్ లను తగ్గిస్తాయట. ఇందులో కెఫిన్ పుష్కలంగా ఉండడం వల్ల నిద్రాభంగం కలిగించవచ్చు. కాబట్టి ఉదయాన్నే ఒక టీ తాగడం మంచిది. అయితే దీనిని మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కానీ తగు మోతాదులో వీటి వినియోగం అధిక సాంద్రత కలిగిన HDLను పెంచుకునేందుకు దోహద పడుతుంది. డయాబెటిస్, బీపీ, ఊబకాయం వంటి మెటబాలిక్ సిండ్రోమ్ లను తగ్గించేందుకు గ్రీన్ టీ ఎంతో ఉపయోగకరం అని ఇదే అధ్యయనం తెలుపుతోంది.


మందార టీ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ప్రతి రోజు మందార టీ తీసుకునే వారిలో ట్రైగ్లిజరాయిడ్లు, LDL స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు ఒక అధ్యయనం రుజువు చేసిందట. అంతేకాదు నెల తర్వాత పరీక్షల్లో HDL స్థాయిలు కూడా మెరుగయ్యాయని తెలిసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి నుంచి ప్రచురితమైన ఒక అధ్యనయం ప్రకారం రెగ్యులర్ గా మందర టీ తీసుకునే వారిలో గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుముఖం పట్టిందట.


కొన్ని జాగ్రత్తలు


కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఉడికించిన పదార్థాలు తీసుకోవడం అవసరం. గ్రిల్లింగ్ చేసినవి, స్టీమింగ్ చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఫ్యాట్ ఇన్ టేక్ తగ్గించుకోవచ్చు. పాలు పాల పదార్థాల వినియోగంలో కూడా లోఫ్యాట్ వెరైటీస్ ఎంచుకోవాలి.


అంతేకాదు వారంలో కనీసం నాలుగు రోజుల పాటు లేదా వారానికి రెండున్నర గంటల పాటు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి కార్డయో వ్యాయామాలు చేయ్యాలి. వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడిని సమర్థవంతంగా మేనేజ్ చేసేందుకు గాను యోగా, మెడిటేషన్ సాధన చెయ్యాలి.


ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో కొలెస్ట్రాల్ సమస్యను అదుపులో పెట్టుకుని ప్రాణాంతక ప్రమాదకర పరిస్థితుల నుంచి దూరం కావచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.