Stock Market Today, 12 May 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 62 పాయింట్లు లేదా 0.34 శాతం రెడ్ కలర్‌లో 18,288 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టాటా మోటార్స్, డిఎల్‌ఎఫ్, వేదాంత, సిప్లా. ఈ కంపెనీల షేర్లపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
దీపక్ నైట్రేట్ (Deepak Nitrite): 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో దీపక్ నైట్రేట్ నికర లాభం 12% తగ్గి రూ. 234 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,961 కోట్లుగా ఉంది.
ఐషర్ మోటార్స్ (Eicher Motors): 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐషర్ మోటార్స్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం రూ. 905 వద్దకు చేరింది, 48% వృద్ధిని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19% పెరిగి రూ. 3,804 కోట్లకు చేరుకుంది.
మంగళూరు కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ (Mangalore Chemicals & Fertilizers): FY23 చివరి త్రైమాసికంలో మంగళూరు కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ రూ. 68 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, FY22 ఇదే కాలంతో పోలిస్తే ఇది అనేక రెట్లు పెరిగింది. కార్యకలాపాల ద్వారా రూ. 1,164 కోట్ల ఆదాయం వచ్చింది.
జెన్సార్ టెక్నాలజీస్ (Zensar Technologies): 2023 మార్చి త్రైమాసికంలో జెన్సార్ టెక్నాలజీస్‌కు నికర లాభం రూపంలో రూ. 119 కోట్లు మిగిలాయి. అదే సమయంలో, కంపెనీ ఆదాయం రూ. 1,212 కోట్లుగా ఉంది.
జీఎస్‌పీఎల్ (GSPL): 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో GSPL రూ. 224 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే కాలంలో, కంపెనీకి రూ. 443 కోట్ల ఆదాయం వచ్చింది.
బీఎస్‌ఈ (BSE): 2023 జనవరి-మార్చి కాలంలో బీఎస్‌ఈ నికర లాభం 122 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. అదే త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 227 కోట్ల ఆదాయం వచ్చింది.
జిల్లెట్ ఇండియా (Gillette India): నాలుగో త్రైమాసికంలో జిల్లెట్ ఇండియా నికర లాభం 48% వృద్ధి చెంది రూ. 103 కోట్లకు చేరుకోగా, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 9% పెరిగి రూ. 619 కోట్లకు చేరుకుంది.
శంకర బిల్డింగ్ (Shankara Building): 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో శంకర బిల్డింగ్‌కు కార్యకలాపాల ద్వారా రూ. 1,210 కోట్ల ఆదాయం రాగా, అన్ని వ్యయాలు పోగా రూ. 19 కోట్ల ఏకీకృత నికర లాభం మిగిలింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.