ముక్కు లోపల ఉండే క్యావిటీలను సైనసెస్ అంటారు. అలర్జీ, జలుబు చేసినప్పుడు, దుమ్ము ఎక్కువగా పీల్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ కారణంగా సైనసెస్ మూసుకుపోతుంది. ముక్కులో శ్లేష్మం పేరుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఒక్కోసారి వాసన కూడా గ్రహించలేము. దీని వల్ల తలనొప్పి, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాలలో సైనసైటిస్ తీవ్రంగా రావడం వల్ల బ్రెయిన్ ఫీవర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సైనస్ సమస్య నుంచి బయట పడేందుకు సహజ సిద్ధంగా ఉండే హోమ్ రెమిడీస్ ఉన్నాయి. వాటిని పాటిస్తే సైనస్ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. దీని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోగా మంచి ఉపశమనం కూడా లభిస్తుంది.


యాపిల్ సైడ్ వెనిగర్


ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్న సహజ సిద్ధమైన పదార్థం. జలుబు, దగ్గు, అలర్జీ లేదా ఫ్లూ లక్షణాలను ఎదుర్కొనగలిగే యాంటీ బ్యాక్టీరియా గుణాలని కలిగి ఉంది. అలర్జీ సమయంలో కేవలం ఒక టీ స్పూన్ యాపిల్ సైడ్ వెనిగర్ ని తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాన్ని మీరు పొందుతారు.


స్టీమ్ థెరపీ


నాసికా రంధ్రాలను తెరవడంలో స్టీమ్ థెరపీ బాగా సహాయపడుతుంది. వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత ఆవిరిని పీల్చుకోడానికి ప్రయత్నించండి. వేడి వేడి నీటి మీద మీ ముఖాన్ని ఉంచి ఆవిరి బయటకి పోకుండా ఏదైనా దుప్పటి కప్పుకుని చక్కగా ఆవిరి పట్టొచ్చు. ఇలా చెయ్యడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి.


పసుపు, అల్లం


పసుపులో మంచిగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. సైనస్ కి చికిత్స చెయ్యడంలో గొప్ప ఔషధం. వేడి వేడి టీలో పసుపు కలుకుని తాగొచ్చు. అల్లం టీ లో కూడా కొద్దిగా పసుపు వేసుకుని తాగడం వల్ల ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని పోగొట్టడంలో సహాయపడుతుంది. ఇది తాగడం వల్ల తక్షణమే మీకు మంచి అనుభూతి కలిగిస్తుంది.


యూకలిప్టస్ ఆయిల్


ఈ నూనె సైనస్ ఇన్ఫెక్షన్ తో పోరాడటంలో సహాయపడుతుంది. చేతి కర్చీఫ్ లేదా ఒక క్లాత్ లో ఒకటి లేదా రెండు  చుక్కల యూకలిప్టస్ నూనె వేసి ఆ వాసన పీల్చుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముక్కు దిబ్బడ  నుంచి కూడా ఉపశమనం లభించేలా చేస్తుంది. ప్ర రోజు దీన్ని తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలని మీరు పొందుతారు.


ఎర్ర మిరపకాయల పొడి


కారంగా ఉండే ఈ పొడి సైనస్లను తెరుచుకునేందుకు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా ఈ పొడి కలుపుకుని రోజుకి రెండు, మూడు సార్లు తాగొచ్చు. మంట లేకుండా ఉండేందుకు ఒక టీ స్పూన్ తేనె జోడించుకోవచ్చు. మీకు నోటి పూత సమస్య ఉంటే ఈ రెమిడిని ఉపయోగించకపోవడమే మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: గర్భం ధరించారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి


Also Read: బరువు తగ్గాలన్నా, జుట్టు పెరగాలన్నా అంజీరా తినెయ్యండి - మరెన్నో ప్రయోజనాలు