Hair Growth Remedies : వింటర్లో చాలామందికి చుండ్రు సమస్యతో పాటు జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు కొన్ని ఇంటి చిట్కాల రోజూ ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గుతుందట. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. మరి ఇంట్లో సింపుల్‌గా ఫాలో అవ్వగలిగే చిట్కాలు, హెయిర్ ప్యాక్‌లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా చాలా మంచిది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముందుగా గ్రీన్ టీని కాచి.. దానిని చల్లారనివ్వాలి. తలస్నానం చేసిన తర్వాత.. టీతో స్కాల్ప్‌కి మసాజ్ చేయాలి. ఓ గంట దానిని తలకు ఉంచి.. అనంతరం చల్లని నీటితో జుట్టును వాష్ చేయాలి. ఇది జుట్టును హెల్తీగా, స్ట్రాంగ్‌గా చేస్తుంది.
రోజ్మెరీ ఆయిల్
రోజ్మెరీ ఆయిల్ తలలో బ్లడ్ సర్క్యూలేషన్‌ని పెంచుతుంది. స్కాల్ప్ ఫోలికల్స్‌ని మెరుగుపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రోజ్మెరీ ఆయిల్ కొన్ని చుక్కలు తీసుకుని.. స్కాల్ప్‌పై మసాజ్ చేయాలి. దీనిని అరగంట ఉంచి లేదా రాత్రంతా ఉంచి.. ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. రెగ్యులర్‌గా ఫాలో అయితే జుట్టు పెరుగుదలను మీరే చూస్తారు.
మెంతులు
జుట్టు సమస్యలను దూరం చేయడంలో మెంతులు మంచి ఫలితాలిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. వీటిలో ప్రోటీన్, నికొటినిక్ యాసిడ్, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను పెంచుతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్‌లో pHను బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా జుట్టురాలడాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టుకు షైన్‌ని అందించి.. స్కాల్ప్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టులో ప్రోటీన్ తగ్గకుండా హెల్ప్ చేస్తాయి. ఆయిల్‌ని వేడి చేసి.. తలపై మసాజ్ చేసి.. రాత్రంతా ఉంచి.. ఉదయాన్నే తలస్నానం చేస్తే జుట్టుకి మంచి పోషణ అందుతుంది. డ్రై హెయిర్ తగ్గి.. హెల్తీగా మారుతుంది.
ఉల్లిపాయ జ్యూస్
ఉల్లిపాయ జ్యూస్‌ని తలకు అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. దీనిలోని సల్ఫర్ జుట్టు పెరుగుదలని ప్రమోట్ చేస్తాయి. అలాగే జుట్టును స్ట్రాంగ్ చేస్తుంది. తలలో రక్తప్రసరణను పెంచి.. హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంది.
ఆముదం కూడా జుట్టు పెరుగుదలకు మంచిది. అలెవెరా జెల్‌ని హెయిర్‌కి ప్యాక్‌గా వేసుకున్నా జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఎగ్ మాస్క్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి వీటిని మీ హెయిర్ కేర్ రోటీన్లో ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గి.. పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వీటిని కంటిన్యూగా చేస్తే మంచి ఫలితాలుంటాయి. గుడ్ థింగ్స్ కెన్ టేక్ టైమ్ అన్నట్టుగానే.. రెగ్యులర్‌గా ఈ టిప్స్ ఫాలో అయితే జుట్టు మంచి కండీషన్లోకి మారుతుంది. జుట్టు రాలడం తగ్గి గ్రోత్ ఉంటుంది.
Also Read : ఆ పనులతో కిడ్నీలు హాంఫట్.. రోటీన్ కాదు డేజంర్ అంటోన్న నిపుణులు, జాగ్రత్త