Ind Vs Aus Test Series: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో అజేయ సెంచరీ చేసి ఫర్వాలేదనిపించిన కోహ్లీ.. ఆ తర్వాత ఆడిన మూడు ఇన్సింగ్స్లో లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ అవతలికి వెళుతున్న బంతిని వేటాడి ఔటయిపోతున్నాడు. తాజాగా బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులోనూ అదే తరహాలో ఔటయ్యాడు. ఈసారి మరీ ఘోరగా ఆరో, ఏడో స్టంప్ పై పడిన బంతిని ఆడి మరీ పెవిలియన్ కు చేరాడు. దీనిపై భారత దిగ్గజ ప్లేయర్ సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సంయమనంతో ఆడలేవా..?
ఇక పదే పదే ఆఫ్ స్టంప్ పై పడుతున్న బంతికి ఔటవుతున్న కోహ్లీని ఉద్దేశించి గావస్కర్ దాదాపుగా మందలించాడు. బ్రిస్బేన్ లో బ్యాటింగ్ నిలకడ ప్రదర్శించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. కాసేపు అలాంటి బంతులకు దూరంగా ఉంటే బాగుండేదని విమర్శించాడు. వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని వేటాడి ఔటవ్వడం సరికాదన్నాడు. ఆ బలహీనతను అధిగమించాల్సిన అవసరం ఉందన్నాడు. కోహ్లీ కొంచెం సంయమనంతో ఆడితే వికెట్ పడకుండా ఉండేదని తెలిపాడు. పేలవ షాట్ తో కోహ్లీ నిరాశ పరిచాడని పేర్కొన్నాడు. మరోవైపు ఈ సిరీస్ లో కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో5 రన్స్, అడిలైడ్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 18 పరుగులు, ఇప్పుడు తాజాగా బ్రిస్బేన్ లో 3 పరుగులు చేయడంతో కోహ్లీపై విమర్శలు పెరుగుతున్నాయి. సరిగ్గా రాణించకుంటే కోహ్లీకి ఇదే చివరి సిరీస్ అనే వ్యాఖ్యలు కూడా మాజీల నుంచి వినిపించాయి.
బ్యాటింగ్ కోచ్ ఏం చేస్తున్నట్లు..
భారత క్రికెటర్లు ఒకే తరహాలో ఔటవుతున్నా కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నారని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నించాడు. టెక్నిక్ సరి చేయకుండా, తిరిగి అదే విధంగా ఔట్ కాకుండా చూడాల్సిన బాధ్యత వారిదేనని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడ కొరవడుతోందని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. 445 పరుగుల భారీ స్కోరు చేసి టీమిండియాకు సవాలు విసిరింది. ట్రావిస్ హెడ్ 152 పరుగులు, స్టీవ్ స్మిత్ 101 పరుగులు, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కేరీ 70 రన్స్ తో రాణించాడు. ఇక వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన మూడో రోజు ఆటలో భారత్ నాలుగు వికెట్లకు 51 పరుగులు చేసింది. ఆట ముగిసేరికి రాహుల్ 33 పరుగులతో, రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు.
Also Read: Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం