Difference Between Hepatitis and Jaundice : హెపటైటిస్​మీద సరైన అవగాహన లేక.. ఆ సమస్యకుండే లక్షణాలు చూసి దానినే కామెర్లు అనుకుంటారు. కానీ ఈ రెండు పూర్తిగా వేరు. లక్షణాలు దగ్గరగా ఉన్నా.. ఈ ఆరోగ్య సమస్యల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా హెపటైటిస్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలి. కాలేయవాపునకు దారి తీసి.. ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి హెపటైటిస్ గురించి తెలుసుకోవడంతో పాటు.. కామెర్లు, హెపటైటిస్ మధ్య ఉన్న వ్యత్యాసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


హెపటైటిస్, జాండిస్ మధ్య తేడాలివే.. 


హైపటైటిస్, కామెర్లు రెండు భిన్నమైన ఆరోగ్య సమస్యలు. వాటి లక్షణాల వల్ల రెండూ ఒకటే అనుకుంటారు. అయితే వాటి మధ్య ఉన్న తేడాలు గుర్తించి చికిత్స తీసుకుంటే మంచిది. 


హెపటైటిస్ 


హెపటైటిస్ వైరస్​లు ఈ వ్యాధికి ప్రధాన కారణమవుతాయి. కానీ ఆ వైరస్​తో పాటు.. పలురకాల ఇన్​ఫెక్షన్లు, ఇమ్యూన్ వ్యాధులు, ఆల్కహాల్, డ్రగ్స్ వంటివి పరిస్థితిని విషమం చేస్తాయి. పైగా సకాలంలో చికిత్స అందించకపోతే.. క్యాన్సర్​తో పాటు కాలేయ సమస్యలను పెంచి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుంది. 


హైపటైటిస్ కాలేయ వాపునకు దారి తీస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల వస్తుంది. హైపటైటిస్ A, B, C, D, E వైరస్​లు దీనిలో ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని అటాక్ చేసి.. లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్నిరకాల కెమికల్స్, మెడికేషన్స్ పరిస్థితిని తీవ్రం చేస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో కూడా హెపటైటిస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 


హైపటైటిస్ లక్షణాలు ఇవే.. 


ఫటిగో, వాంతులు, కడుపు నొప్పి, పొత్తికడుపు వాపు, యూరిన్ డార్క్​గా రావడం, మూత్రవిసర్జనలో మార్పులు హెపటైటిస్ లక్షణాలుగా చెప్తారు. 


కామెర్లు (Jaundice)


చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతే అది కామెర్లు అవుతుంది. రక్తంలోని ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమై.. పసుపు వర్ణద్రవ్యం పేరుకుపోయి.. ఈ పరిస్థితి ఏర్పడుతుంది. 


కామెర్లు రావడానికి కారణాలివే.. 


హెపటైటిస్, లివర్ క్యాన్సర్ వంటి లివర్ సమస్యలు కామెర్లకు దారితీస్తాయి. హీమోలిటిక్ అనీమియా, మూత్ర విసర్జన జరగకుండా నిరోధించడం, కొన్ని అంటువ్యాధులు, మందులు, జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు కామెర్లకు దారి తీస్తాయి. 


కామెర్ల లక్షణాలివే.. 


శరీరం, కళ్లు పసుపు రంగులోకి మారడం, యూరిన్ డార్క్ అవ్వడం, మూత్రవిసర్జనలో మార్పులు, ఫటిగో లక్షణాలు ఉంటాయి. 


వ్యత్యాసాలు ఇవే 


కాలేయ వాపు వల్ల హెపటైటిస్ వస్తుంది. రక్తంలో బిలిరుబిన్ చేరడం వల్ల కామెర్లు వస్తాయి. రెండు సమస్యల్లో లక్షణాలు దగ్గరగా ఉన్నప్పటికీ.. హెపటైటిస్ కడుపునొప్పి, వాంతులు వంటి తీవ్రమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి గుర్తించినప్పుడు కచ్చితంగా వైద్యుల సహాయం వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది. 



Also Read : హెపటైటిస్​ HIV కంటే డేంజర్​ అట.. ఇండియాలో ఏటా రెండు లక్షలమందిని ప్రభావితం చేస్తోన్న వైరస్







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.