Telangana News :ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్ పరీక్షలు ఇవాళ్టి(7 ఫిబ్రవరి 2025) నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవాళ్టి నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు నాలుగు విడతల్లో చేపడతారు. అయితే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు  అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఏదైనా బలమైన కారణంతో పరీక్షలకు హాజరుకాకపోతే మళ్లీ రాసుకునే ఛాన్స్ ఇస్తున్నట్టు వెల్లడించారు. 

ఏదైనా కారణాలతో ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేకపోతే మళ్లీ హాజరుకావచ్చని ఇంటర్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్యం, ఇంకా ఏదైనా ఇతర బలమైన కారణం ఉంటేనే ఈ రూల్ వర్తిస్తుందని అన్నారు. 22వ తేదీ వరకు జరిగే ప్రాక్టికల్ పరీక్షల్లో ఎప్పుడైనా హాజరయ్యేందుకు ఛాన్స్ ఇచ్చారు.  

Also Read: తెలంగాణ ఎడ్‌సెట్‌, పీఈసెట్ షెడ్యూల్‌ విడుదల, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

వారం పదిరోజుల్లో గ్రూప్‌ -1 మెయిన్స్ పరీక్ష ఫలితాాలు

గ్రూప్ 1 పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. వారం పది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం ముగిసింది. ఒక పోస్టుకు ఇద్దర్ని మెరిట్‌ జాబితా విడుదల చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి వారం పది రోజులు పడుతుందని అంటున్నారు. గతేడాది నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 21వేల మందికిపైగా హాజరయ్యారు. ప్రస్తుతం లెక్క ప్రకారం ఒక పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు.  

మెరిట్ జాబితా సిద్ధమైన తర్వాత టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పెడతారు. అక్కడ ఎంపికైన వారి జాబితా మాత్రమే ఉంచుతారు. వ్యక్తిగత లాగిన్ ద్వారా కూడా అభ్యర్థులు తమ మార్కులు చూసుకోవచ్చు. ఏ పేపర్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలుస్తోంది. వాటిపై అనుమానం ఉంటే 15 రోజుల్లో రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆరు పేపర్లలో ఏ పేపర్‌లో అనుమానం ఉన్నా రీకౌంటింగ్ చేయించుకోవచ్చు. ఆరు పేపర్లకు కూడ రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక్కో పేపర్‌కు వెయ్యి రూపాయల  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ పేపర్‌ను మళ్లీ రీకౌంటింగ్ చేసి తేడాలు ఉంటే సరి చేస్తారరు. 

Also Read: రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ మాక్‌ టెస్టులు అందుబాటులో - పరీక్షలు ఎప్పటినుంచంటే?