TG EDCET 2025: తెలంగాణ ఎడ్‌సెట్‌, పీఈసెట్ షెడ్యూల్‌ విడుదల, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

TG EDCET 2025: తెలంగాణలో బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్‌సెట్-2025 నోటిఫికేషన్ మార్చి 10న విడుదల కానుంది. మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Continues below advertisement

TG PECET-TG EDCET 2025: తెలంగాణలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీజీ ఎడ్‌సెట్-2025' ప్రవేశ ప‌రీక్ష షెడ్యూలు విడుద‌లైంది. ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 10న ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 12 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థుల నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్‌ 1న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎడ్‌సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్(TG EDCET) కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి వ్యవహరించనున్నారు.

Continues below advertisement

టీజీ ఎడ్‌సెట్ 2025 షెడ్యూలు..

➥ ఫిబ్రవరి 6న ఎడ్‌సెట్ షెడ్యూలు ప్రకటన

➥ మార్చి 10న టీజీఎడ్‌సెట్‌-2025 నోటిఫికేష‌న్‌

➥ మార్చి 12 నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ స్వీక‌రణ

➥ మే 13 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణకు అవకాశం

➥ జూన్ 1న కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో రాత‌ప‌రీక్ష నిర్వహణ.

పీఈ షెడ్యూలు ఇలా..
తెలంగాణ ఎడ్‌సెట్-2025 షెడ్యూలుతోపాటు పీఈసెట్-2025 షెడ్యూలును సైతం ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. పీఈసెట్‌ నోటిఫికేషన్‌ మార్చి 12న విడుదల కానుంది. మార్చి 15 నుంచి మే 24 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో మే 30 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్‌ 11 నుంచి 14 వరకు పీఈ‌సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎడ్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల..

టీజీపీఈసెట్-2025 షెడ్యూలు..

➥ ఫిబ్రవరి 6న ఎడ్‌సెట్ షెడ్యూలు ప్రకటన

➥ మార్చి 12న టీజీపీఈసెట్‌-2025 నోటిఫికేష‌న్‌

➥ మార్చి 15 నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ స్వీక‌రణ

➥ మే 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణకు అవకాశం

➥ ఆలస్య రుసుముతో మే 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణకు అవకాశం

➥ పీఈసెట్ పరీక్షలను జూన్‌ 11 నుంచి 14 వరకు నిర్వహిస్తారు.

తెలంగాణలో ఇతర పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ ఈ షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 22 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు  టీజీఎప్‌సెట్ (TG EAPCET 2025) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు; మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. 

➥ తెలంగాణ పీజీ ఈసెట్- 2025 షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ (PG ECET) నిర్వహించనున్నారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ.అరుణ కుమారి వ్యవహరించనున్నారు.

➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ (TG ICET) పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్‌ను నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఐసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అలువాల రవి వ్యవహరించనున్నారు.

➥ ఎల్‌ఎల్‌బీ ప్రవేశాల కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. లాసెట్, పీజీఎల్ సెట్  (TG LAWCET/ PGLCET)నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించి.. కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి వ్యవహరించనున్నారు.

➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ (PG ECET) నిర్వహించనున్నారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ.అరుణ కుమారి వ్యవహరించనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement