most expensive shopping street:  అది ఖరీదైన మాల్ కాదు..  దుబాయ్ షాపింగ్ సెంటర్ కూడా కాదు. అది ఓ వీధి. మన ఊళ్లల్లో ఇంకా చెప్పాలంటే గచ్చిబౌలిలో వరుసగా ఉండే బ్రాండెడ్ దుకాణాలు ఉండే వీధి లాంటిది. కానీ దానికో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. అక్కడకు వెళ్లే ప్రతి ఒక్కరూ కనీసం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందేనట. అంటే అది కనీసం. కాస్త ఏదైనా కొనాలనుకుని వెళ్తే అది కోటి దాకా వెళ్లినా ఆశ్చర్యం ఉండదు. అందుకే ఆ వీధికి ప్రపంచంలోనే అతి ఖరీదైన.. ఎక్స్ పెన్సివ్ షాపింగ్ స్ట్రీట్ గా పేరు తెచ్చుకుంది. 


అది ఎక్కడ అంటే..  ఇటలీలోని మోంటే నెపోలియన్ కు దక్కింది. కుష్మాన్ & వేక్ఫీల్డ్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ ఫ్యాషన్ నగరంగా పేరు పొందిన  మిలన్ లో ఈ వీధి ఉంది.  ఈ వీధి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షాపింగ్ సెంటర్ గా నిలిచింది. 2024 కి ముందు న్యూయార్క్ లోని ఫిఫ్త్ అవెన్యూ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని మిలన్ నగరంలోని మోంటే నెపోలియన్ వీధికి దక్కింది.                       


మిలన్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ అయిన క్వాడ్రిలాటెరో డెల్లా మోడాలో ఉన్న వయా మోంటే నెపోలియన్ ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన షాపింగ్  సెంటర్లలో ఒకటిగా మారింది. ఇక్కడ  గూచీ, ప్రాడా, లూయిస్ విట్టన్, చానెల్ మరియు డోల్స్ & గబ్బానా వంటి ప్రఖ్యాత డిజైనర్ బ్రాండ్‌ల ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లు ఉన్నాయి.  హై-ఎండ్ ఫ్యాషన్‌తో పాటు ప్రత్యేకమైన నగల బోటిక్‌లు , అత్యంత ఖరీదైన ఇటాలియన్ షూ తయారీదారుల షోరూంలు కూడా ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చే ప్రతి కస్టమర్ కనీసం రెండు లక్షలు ఖర్చు పెడతారు. ఇక.. అంటే ఓ బ్యాగ్ కూడా కనీసం రెండు లక్షలు ఉంటుదని అనుకోవచ్చు.                       


ఇక్కడకు షాపింగ్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగాఉన్న సెలబ్రిటీలు వస్తారు. హాలీవుడ్, బాలీవుడ్ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ తారలు కూడా అక్కడకు వెళ్లి షాపింగ్ చేస్తారు. ప్రపంచ కబేరులు కూడా ఇక్కడ హై ఎండ్ బ్రాండ్ల ఫ్లాగ్ షిప్ షోరూంలలో తమకు నచ్చిన వస్తువులు, దుస్తులు ఆర్డర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఇంత బిజినెస్ చేసే ఈ వీధిలో  ఎవరైనా వ్యాపారం చేయాలంటే... చిన్న విషయం కాదు. అందుకే అక్కడ దుకాణాల అద్దెలు కూడా హయ్యస్ట్ ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యాషన్ బ్రాండ్లు కూడా అక్కడి అద్దెల్ని భరించడానికి ఆలోచిస్తాయి.                   



Also Read: ఇన్‌ఫోసిస్, ఎల్ అండ్ టీ పెద్దలనుకుంటే వాళ్ల తాత ఎలాన్ మస్క్ - వారానికి 120 గంటలు పని చేయాలట !