బాలీవుడ్ క్యూట్ పెయిర్ రణబీర్ కపూర్, ఆలియా భట్ త్వరలోనే తమ ఇంటికి బుజ్జి పాప/బాబు ని ఆహ్వానించనున్నారు. మాతృత్వం అనేది గొప్ప వరం. అమ్మా అని పిలిపించుకునే ఆ మధుర క్షణాల కోసం ఆలియా ఎంతగానో ఎదురు చూస్తోంది. రాబోయే బిడ్డ గురించి ఈ దంపతులు ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇద్దరూ  సమానంగా పుట్టబోయే బిడ్డ బాధ్యత తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా ఇటీవీల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తమ జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తి గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తల్లిదండ్రులుగా బాధ్యతలు కలిసి పంచుకుంటామని తెలిపారు.


ఆలియా తల్లి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. త్వరగా తన వర్క్ లైఫ్ కూడా లీడ్ చేయాలని రణబీర్ ఆశపడుతున్నాడు. తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. తాను కూడా కొన్ని రోజులు షూటింగ్స్ కి విరామం ఇచ్చి తమ బిడ్డ కోసం సమయం కేటాయిస్తానని రణబీర్ అన్నాడు. ఓ వైపు పని చేస్తూనే మరో వైపు పిల్లల పాలన చూసుకోవడం అనేది సవాల్ తో కూడుకున్న విషయం. ఇటువంటి వాటిలో మహిళలు బిడ్డ పుట్టిన తర్వాత తమ కెరీర్, ఆరోగ్యం మీద శ్రద్ధ తక్కువగా బిడ్డ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. వృత్తిని పక్కన పెట్టి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పని చేస్తూ ఇంటి బాధ్యతలు నిర్వర్తించడం కష్టం అవుతుంది. ఇది శారీరకంగా, మానసికంగా వారిని బలహీనంగా మారుస్తుంది.  కాబోయే తల్లులు కొన్ని చిట్కాలు పాటిస్తే అటు వారి ఆరోగ్యం ఇటు పుట్టిన బిడ్డ మరోవైపు వర్క్ బ్యాలెన్స్ గా చేసుకోవచ్చని అంటోంది.


యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉమెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం అమ్మ అయిన తర్వాత మహిళలు వ్యాయామం పట్ల ఆసక్తి చూపించడం లేదట. అంతే కాదు వాళ్ళు తినడానికి కూడా కనీస సమయం వెచ్చించకుండా ఎక్కువ సమయం ఇంటి పనులు, పిల్లల సంరక్షణ చూసుకోవడానికి టైమ్ అయిపోతుందని అంటున్నారు. అలా కాకుండా అన్నీ సమానంగా చూసుకోవడానికి ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మీ వృత్తిని కూడా కొనసాగించవచ్చు.


తగినంత నిద్ర పోవాలి


ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం మనిషికి కనీసం 7-9 గంటల నిద్ర అవసరం. అందుకే కంటి నిండా నిద్రపోతే ఎటువంటి అనారోగ్య సమస్యలు దారి చేరవు. ఇదే కాదు ప్రసవించిన తర్వాత పొట్ట భాగం ఎక్కువగానే కనిపిస్తుంది. దాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.


పుష్కలంగా నీరు తాగాలి


శరీర పనితీరు సక్రమంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం అవసరం. రోజుకి కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. కొత్తగా అమ్మ అయిన మహిళల మూత్రపిండాలు, అలసట వంటి అనారోగ్య సమస్యలతో పోరాడుతారు. వారి స్కిన్ కూడా సాగిపోయి కనిపిస్తుంది. మళ్ళీ చర్మం సాధారణ స్థితికి చేరాలంటే నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే శరీరం కూడా హైడ్రేట్ గా ఉంటుంది.


క్రమం తప్పకుండా వ్యాయామం


శిశువు అలనాపాలనా చూసుకోవడం వల్ల కొద్దిగా బిజీగా మారిపోతారు. కానీ తల్లి తన ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మిమ్మల్ని ఫిట్ గా ఆరోగ్యంగా ఉంచడమే కాదు శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది.


పోషకాహారం తీసుకోవాలి


ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా తల్లి పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అది తల్లి, బిడ్డకి మేలు చేస్తుంది. ఆహార ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుని సలహా మేరకు డైట్ ప్లాన్ చేసుకుని తప్పనిసరిగా దాన్ని అనుసరించాలి. బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల శక్తి సన్నగిల్లుతుంది. అందుకే పోషకాలు నిండిన ఆహార పదార్థాలు ఎంపిక చేసుకోవాలి.


Also Read: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు


Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!