వాలెంటైన్స్ వీక్‌ (Valentine Week) అప్పుడే నాలుగురోజులు గడిచిపోయి అయిదో రోజుకు వచ్చేసింది. అయిదో రోజును ప్రామిస్ డే (Promise Day)గా నిర్వహించుకుంటారు. ప్రేమను వ్యక్తపరిస్తే సరిపోదు ఎదుటివారికి నమ్మకం కలిగేలా కొన్ని వాగ్ధానాలు చేయాలి. ఆ వాగ్ధానాలలోనే మీ ప్రేమ కూడా కనిపించాలి. అలాంటి అందమైన వాగ్ధానాలు పంపించే రోజు ఇదే. ప్రేయసీ ప్రియులకే కాదు, భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుకోవడానికి కూడా వాగ్ధానాలు చాలా అవసరం. మీ భావాలను వ్యక్తీకరించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ ప్రామిస్ డే కన్నా మంచి రోజు లేదు. ఇంకెందుకాలస్యం మీకు ప్రియుతములకు మంచి వాగ్ధానాలతో కూడిన మెసేజ్‌లను పంపేయండి. కొన్ని ప్రేమ నిండిన వాగ్ధానాలను ఇక్కడ అందించాం. 


1. ప్రపంచంలో నువ్వెప్పుడు ఒంటరివని నీకు అనిపించకుండా చేస్తాను... ఇదే నా వాగ్ధానం


2. మనం ఎన్నిసార్లు గొడవలు పడినా నేను నిన్న ప్రేమించడం మాత్రం ఆపనని వాగ్ధానం చేస్తున్నాను. ఈ మాటను జీవితాంతం నిలబెట్టుకుంటాను. హ్యాపీ ప్రామిస్ డే.  


3. ఎలాంటి సమస్యలు వచ్చినా నేను నీకు అండగా, రక్షణగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను, హ్యాపీ ప్రామిస్ డే


4. నేను శ్వాస తీసుకున్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. ఇదే నా వాగ్ధానం. హ్యాపీ ప్రామిస్ డే. 


5. మీ చిరునవ్వు నా జీవితంలో వెలుగు నింపినట్టుగా, మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను మీకు వెలుగునవుతానని వాగ్ధానం చేస్తున్నాను. హ్యాపీ ప్రామిస్ డే. 


6. నేను నీ అందాన్ని చూడలేదు, మనసును చూశాను. జీవితాంతం నీ మనసునే చూస్తాను. హ్యాపీ ప్రామిస్ డే. 


7. నీ మీదున్న ప్రేమ చావదు, వేరొకరి మీద పుట్టదు, నువ్వు నా ప్రేమను ఒప్పుకునేంత వరకు వేచి ఉంటా, ఇదే నా వాగ్ధానం. 


8. నువ్వు ఒప్పుకుంటే చాలు, నీకు నేను తోడుంటా జీవితాంతం ఆనందపు అక్షయపాత్రనై.. ఇదే నా వాగ్ధానం.





Also read: మీ ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింకులు వల్ల గుండె పోటు వచ్చే అవకాశం, హార్వర్డ్ పరిశోధన ఫలితం


Also read: అంకాపూర్ చికెన్ కర్రీ ఇంట్లోనే ఇలా చేసుకోండి, వండుతుంటేనే నోరూరిపోవడం ఖాయం