Horoscope Today 11 February 2022:

  2022 ఫిబ్రవరి 11 శుక్రవారం రాశిఫలాలు


మేషం ( Aries)
ఈ రోజు మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోండి. మీరు ఒకరి విషయాల గురించి మానసికంగా కలవరపడతారు. చెడు ఆలోచనలు రావొచ్చు జాగ్రత్త. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఆగ్రహంగా ఉంటారు. 
 
వృషభం (Taurus)
వేరేవారి పనిలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆహారాన్ని అదుపులో ఉంచుకోండి. రాజకీయాల్లో ఉండేవారికి ఈ రోజు లాభపడతారు.  కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. 
 
మిథునం (Gemini)
మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ రోజు నుంచి పరిష్కారం లభించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.  విలువైన వస్తువుల భద్రతలో అలసత్వం వహించవద్దు. ఈ రోజంతా బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 


కర్కాటకం ( Cancer)
మారిన పరిస్థితులకు మీరు సర్దుబాటు చేసుకోగలరు. ఇల్లు మారే అవకాశం ఉంది. ఇంటిసభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర మాటలు వద్దు.  ఎవ్వరికీ కఠినంగా సమాధానం ఇవ్వకండి. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి.


సింహం (Leo)
మీరు రోజు స్నేహితులను కలవడానికి వెళతారు. కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితుల్లో మార్పుతో, కొత్త ఒప్పందాలు పూర్తి కాగలవు. సామాజిక జీవితంలో గొప్ప ఆనందం ఉంటుంది. 


కన్య  (Virgo)
ఈ రోజంతా  చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ మనస్సుపై మీకు నియంత్రణ ఉంటుంది. ఎవరినీ విమర్శించవద్దు.


Also Read:  మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..
తుల ( Libra)
ఈరోజు మీ చుట్టుపక్కలవారికి అవసరమైన పనులు పూర్తిచేస్తారు.  ఇరుగుపొరుగు వారితో మంచి రిలేషన్ మెంటైన్ చేస్తారు. మీరు కొత్తపనిని నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. మీ ఆనందం పెరుగుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల తలనొప్పి సమస్యతో బాధపడతారు.


వృశ్చికం (Scorpio)
మీ బిడ్డింగ్‌ను నియంత్రించండి, ఎవరితోనైనా పాత వివాదం తలెత్తవచ్చు. న్యాయపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఏదైనా పనిపై బంధువల వద్దకు వెళ్లాల్సి రావొచ్చు. 


ధనుస్సు ( Sagittarius)
దంపతులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. కుటుంబంతో సయం గడుపుతారు. పనికిరాని విషయాల్లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేయకండి. ఖర్చులు పెరగొచ్చు. నెలవారీ బడ్జెట్‌పై శ్రద్ధ వహించాలి.


మకరం ( Capricorn )
ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి, అలాగే అందరితో రహస్య చర్చలు చేయవద్దు. ప్రభుత్వ పనులు వేగవంతమవుతాయి. మీరు ఒకరి నుంచి అప్పు తీసుకోవాల్సి రావొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చు. 


కుంభం ( Aquarius)
ఈ రోజు మీరు  ఓ గొప్ప వ్యక్తిని కలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూల సమయం. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ మనసును అదుపులో పెట్టుకోండి.
 
మీనం ( Pisces)
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వ్యవసాయ పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడే అవకాశం ఉంది.  ఏదో విషయంపై చెడుగా ఆలోచిస్తారు. రోజంతా  బిజీగానే ఉంటారు.  ఉద్యోగులకు పదోన్నతికి సంబంధించిన సమాచారం లభించవచ్చు. 


Also Read: పదహారణాల తెలుగు అమ్మాయి అని ఎందుకంటారు , ఎలా ఉంటే అనాలి