Allu Arjun Diet and Fitness Tips : అల్లు అర్జున్ బర్త్​డే (ఏప్రిల్ 8వ తేదీన) (Allu Arjun Birthday 2024)సందర్భంగా.. అల్లు అర్జున్ గురించి.. అతని ఫిట్​నెస్, డైట్​, కెరీర్​ గురించి ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేద్దాం. గంగోత్రి సినిమాతో టాలీవుడ్​లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. పుష్పతో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగాడు బన్నీ. రెండు దశాబ్ధాలుగా సినిమాలు చేస్తూ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేస్తున్నాడు. హీరోగా రెండు దశాబ్ధాలు చేస్తూ.. స్టైలిష్​ స్టార్​గా ఉండడం అంటే అంత సులభమైన విషయం కాదు. 2003లో గంగ్రోతితో కెరీర్​ను ప్రారంభించినా.. ఆర్య సినిమాతోనే బన్నీకి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. అప్పటి ఆర్య సినిమాతో డైరక్టర్ సుకుమార్​ బన్నీకి స్టైలిష్ స్టార్​​ అనే పేరును తీసుకువచ్చాడు. ఇప్పుడు బన్నీ పాన్​ ఇండియాలో ఐకాన్ స్టార్​గా మారడం వెనుక కూడా సుకుమార్ ఉన్నాడు.


ఐకాన్ స్టార్​గా ఎదిగి..


ఏది ఏమైనా 20 ఏళ్లుగా స్టైలిష్​ స్టార్​గా ఉంటూ.. ఫిట్​నెస్​ని కాపాడుకుంటూ.. ఫ్యాన్​ బేస్​ని పెంచుకోవడం అంటే అంత సులభమేమి కాదు. అల్లు రామలింగయ్య మనవడిగా.. ప్రొడ్యూసర్ కొడుకుగా.. సినిమాలో కెరీర్ ప్రారంభించడం సులభమే కానీ.. దానిని 20 ఏళ్లుగా నిలబెట్టుకోవడం అంటే కచ్చితంగా అభినందిచాల్సిన విషయమే. కేవలం తెలుగులో సినిమాలు చేస్తూ.. మలయాళంలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్​ సంపాదించుకున్నాడంటే అది కచ్చితంగా బన్నీ మ్యాజిక్కే. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్​గా మారి.. ఇండియా మొత్తం పుష్ప మానియా క్రియేట్ చేశాడు. అలాంటి బన్నీ కేవలం నటుడిగానే కాకుండా.. ఫిట్​నెస్​ విషయంలో కూడా తన అభిమానులకు రోల్​ మోడల్​గా నిలుస్తున్నాడు. 


బన్నీ ఫిట్​నెస్ టిప్స్


నాలుగు పదుల వయసులో కూడా కుర్రాడిలా కనిపించడమంటే ఫిట్​నెస్​ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. బన్నీ కూడా ఫిట్​నెస్ విషయంలో ఎలాంటి రాజీపడడు. ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్​లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డైట్​, వ్యాయామం వంటి విషయాలపై ఆసక్తికర విషయాలు తెలిపాడు బన్నీ. ఈ రోజు బన్నీ బర్త్​డే సందర్భంగా.. ఫిట్​నెస్​ విషయంలో బన్నీ తీసుకునే జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హెల్తీగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఫాలో అవ్వొచ్చు. 


బన్నీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో 45 నుంచి గంట వరకు రన్ చేస్తాడట. ఇలా చేయడం వల్లే తను ఇప్పటికీ ఫిట్​గా ఉన్నానని చెప్తున్నాడు బన్నీ. పైగా తన మెటబాలీజం పెరగడంలో ఇదే బాగా హెల్ప్ చేసిందని అంటున్నాడు. లంచ్​, డిన్నర్​ డైట్​ని బట్టి మారుతుంది కానీ.. బ్రేక్​ఫాస్ట్​ మాత్రం ఎప్పుడూ ఒకటే తీసుకుంటాడట. అవే ఎగ్స్. ఫిట్​నెస్​పై దృష్టి పెట్టినప్పటి నుంచి బ్రేక్​ఫాస్ట్​లో గుడ్లు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే పోస్ట్ వర్క్​ అవుట్​కి ముందు ప్రోటీన్ షేక్స్, డ్రింక్స్ తీసుకుంటానని వెల్లడించాడు. 


ఆ పదార్థాలకు దూరంగా ఉంటాడట..


సినిమాకు తగ్గట్లు తన డైట్​ ఉంటుందని తెలిపాడు. వారంలో ఓ రెండు సార్లు ఫుడ్​ విషయంలో చీట్​ చేస్తూ ఉంటానని.. సినిమాకు పర్లేదు అనుకున్నప్పుడు మాత్రమే చీట్​ డే ఫాలో అవతానని చెప్పాడు. డెయిరీ ప్రొడెక్ట్స్​కి మాత్రం బన్నీ దూరంగా ఉంటాడట. వాటి వల్ల తనకి అలెర్జీ ఉందని.. అందుకే వాటిని తీసుకోనని తెలిపాడు. కాస్త లేజీగా ఉంటే వారానికి మూడుసార్లు వర్క్​ అవుట్ చేస్తానని.. యాక్టివ్​గా ఉన్నప్పుడు.. సినిమాకు అవసరమనుకున్నప్పుడు వారంలో ఏడు రోజులు వర్క్​ అవుట్ చేస్తానని తెలిపాడు బన్నీ. అల్లు అర్జున్​లాగా మీరు కూడా ఫిట్​గా ఉండాలంటే.. బన్నీ వర్క్​ అవుట్ రోటీన్​ని ఫాలో అయిపోవచ్చు. 


Also Read : ఉగాది పచ్చడిని ట్రెడీషనల్​గా ఇలాగే చేయాలి.. మామిడి కాయలను అస్సలు వేయకూడదట