Googles HeAR AI: ఏఐ టెక్నాలజీ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. వైద్య శాస్త్రంలోనూ ఈ కొత్త టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తోంది. కేవలం దగ్గు శబ్దంతో రోగం ఏంటో క్షణాల్లో చెప్పేస్తోంది. హియర్ ఫౌండేషన్ AI మోడల్ 300 మిలియన్ల ఆడియో డేటా, 100 మిలియన్ల దగ్గు శబ్దాలను ఉపయోగించి రోగం ఏంటో చెప్పగలిగి షాకిస్తోంది. మనం దగ్గితే వచ్చే శబ్దం ద్వారా టీబీ, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి వ్యాధులను గుర్తించే సామర్థ్యం ఉన్న AI మోడల్ ను గూగుల్ డెవలప్ చేసింది. గూగుల్ రీసెంట్ గా హెల్త్ ఎకౌస్టిక్ రిప్రజెంటేషన్స్(HeAR)ని పరిచయం చేసింది.
క్షయ వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక ఫోకస్
నిజానికి ఓ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే.. వారిని ముందుగా చెక్ చేస్తారు. అనంతరం పరీక్షలు చేసి వ్యాధి ఏంటో నిర్థారిస్తారు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఏఐ టెక్నాలజీ డాక్టర్ కంటే వేగంగా ఫలితాలను అందిస్తోంది. ఇప్పటికే, బీపీ, హార్ట్ బీట్, షుగర్ లెక్కలు చెప్పే యాప్‌లు ఉండగా.. ఇప్పుడు దగ్గితే రోగమేంటో చెప్పే యాప్ సిద్ధమవుతున్నది. దగ్గిన శబ్దం వినగానే మనం ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నామో ఇట్టే చెప్పేయనుంది ఈ యాప్.
ఈ యాప్‌లో వివిధ రకాల వ్యాధులతో వచ్చే మిలియన్ల కొద్దీ దగ్గుకు సంబంధించిన శబ్దాలను లోడ్ చేశారు. ఈ క్రమంలో దగ్గు శబ్దాల ద్వారా రోగికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ ఇట్టే చెప్పేయనుంది. టీబీ విషయంలో ఈ యాప్ మరింత సమర్థవంతంగా పని చేయనుంది. “క్షయవ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పుతున్నారు. ఆలస్యంగా రోగనిర్ధారణ కావడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హియర్ కీలక పాత్ర పోషించనుంది. ఈ టెక్నాలజీ భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది” అని హియర్‌లో పనిచేస్తున్న గూగుల్ రీసెర్చ్ ప్రొడక్ట్ మేనేజర్ సుజయ్ కకర్మత్ వెల్లడించారు.
క్షణాల్లోనే టీబీ స్క్రీనింగ్, డిటెక్షన్
2030 నాటికి టీబీనీ అంతం చేయాలనే లక్ష్యంతో గూగుల్ పని చేన్నది. అందులో భాగంగానే HeARను రూపొందించింది. దగ్గు శబ్దం అనేది ఒక్కో రోగానికి ఒక్కోలా ఉంటుంది. ఆ శబ్దాన్ని బేస్ చేసుకుని రోగం ఏంటో HeAR ఇట్టే చెప్పేయనుంది. ఈ టెక్నాలజీని మరింత డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కకర్మత్ తెలిపారు. రానున్న రోజుల్లో క్షణాల్లోనే కేవలం దగ్గు శబ్దం ద్వారా రోగం ఏంటో నిర్ధారించే అవకాశం ఉందన్నారు. HeARతో టీబీ స్క్రీనింగ్, డిటెక్షన్ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని డిజిటల్ హెల్త్ స్పెషలిస్ట్ జి జెన్ క్విన్ తెలిపారు. అత్యంత అవసరమైన వారికి ఈ టెక్నాలజీ సాయపడుతుందని వెల్లడించారు. గూగుల్ రూపొందించిన ఈ టెక్నాలజీ వైద్య రంగంలో కీలక ముందడుగు కాబోతుందన్నారు.
Read Also: ఓ మై గాడ్.. మెదడులోకి చొచ్చుకెళ్తోన్న ప్లాస్టిక్ - గ్లోబల్ ఎమర్జెన్సీ విధించాల్సిందేనట!
Read Also: లీకీ గట్ గురించి ఈ విషయాలు తెలుసా? ఇదిగో సమంత ఏం చెబుతుందో చూడండి