Kids Diet : పోషకాలతో కూడిన ఆహారం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా చాలా మంచిది. ఇది మొత్తం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. శరీరంలోని కణాలు, కండరాలు కలిసి పనిచేయడానికి అవసరమైన శక్తిని పోషకాహారం అందిస్తుంది. కాబట్టి మీకు మంచి ఆరోగ్యం కావాలంటే.. కచ్చితంగా మీరు పోషకాలతో కూడిన ఆహారంపై దృష్టి సారించాలి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలకు పోషకాలతో కూడిన ఫుడ్ అందించడంలో అస్సలు కాంప్రిమైజ్ కావొద్దు అంటున్నారు. అయితే మీరు పోషకాల కోసం పిల్లలకు ఎలాంటి ఫుడ్ అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లు, కూరగాయలు..
పండ్లు, కూరగాయలు వివిధ విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లతో నిండి ఉండి ఉంటాయి. ఇవి వివిధ రూపాల్లో, వివిధ రకాలుగా మనకు లభ్యమవుతాయి. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా పిల్లలో ఎదుగుదలకు.. జుట్టుకు పోషణ అందేలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి పిల్లలు నేరుగా వీటిని తినకపోతే.. సలాడ్స్ రూపంలో, జ్యూస్‌ల రూపంలో వాటిని అందించవచ్చు. స్నాక్స్‌గా కూడా వీటిని మీరు పిల్లలకు వీటిని అందించవచ్చు.
సమతుల్యమైన ఆహారం
మీ పోషకాహార అవసరాలను తీర్చడానికి మీరు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లలకు ముందు నుంచి ఇలాంటి సమతుల్యమైన ఆహారం అందించడం ద్వారా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు త్వరగా రావు అంటున్నారు నిపుణులు. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. అలాగే తక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. సమతుల్యమైన ఆహారం తీసుకునేందుకు మీరు పోర్షన్ కంటైనర్లు, ఫుడ్ స్కేల్స్, కప్స్‌తో మీరు పోషకాహారాన్ని తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు కేలరీలను కూడా బ్యాలెన్స్ చేయవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్
ప్రతి రోజూ కచ్చితంగా పిల్లలు, పెద్దలు కూడా అల్బాహారం తీసుకోవాలి అంటున్నారు. కొందరు సమయం దొరకడం లేదనో.. వండుకోలేమనో కొందరు తినడం మానేస్తారు. పిల్లలు కూడా స్కూల్‌కి లేట్ అవుతుందని సరిగ్గా తినరు. కానీ రోజు మొత్తంలో బ్రేక్‌ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయవద్దు అంటున్నారు ఆహార నిపుణులు. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు. పోషకమైన, సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం వల్ల నిద్రలో పోగొట్టుకున్న పోషకాలను తిరిగి శరీరానికి అందించవచ్చు. దీనివల్ల మీరు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
షుగర్ వద్దు
స్వీట్ క్రేవింగ్స్ ఉండడం వల్ల చాలామంది తెలియకుండా స్వీట్స్ ఎక్కువగా తినేస్తారు. అయితే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు స్వీట్స్ తీసుకోవడం తగ్గించండి. ఇవి మీ ఆరోగ్యానికి అంతమంచివి కావు. ప్రాసెస్ చేసిన ఫుడ్ ఉదయాన్నే తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఇలాంటి ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి అంటున్నారు.
సప్లిమెంట్స్ తీసుకోండి..
సమతుల్యమైన ఆహారం మీ శరీరానికి అవసరమైన అన్ని మూలకాలను సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు ఈ పోషకాహారం పొందడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పోషకాలకోసం సప్లిమెంట్లు తీసుకోవచ్చు. అయితే మీరు ఎలాంటి సప్లిమెంట్లు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అనేదానికోసం వైద్యుడిని సంప్రదించండి.
Also Read : రోజూ ఉదయాన్నే బాదం, వాల్నట్ తింటున్నారా? అయితే ఇది మీకోసమే