Diabetes in Pregnancy : గర్భధారణ సమయంలో రక్తంలో గ్లూకోజ్​కు డిమాండ్ పెరుగుతుంది. ఆ సమయంలో సరైన మోతాదులో శరీరం ఇన్సులిన్​ను ఉత్పత్తి చేయకపోతే.. గర్భధారణ మధుమేహం ఏర్పడుతుంది. ఇది అధిక స్థాయిలో చక్కెర స్థాయిలను విడుదల చేసి.. హానికరమైన ఫలితాలు ఇస్తుంది. ఇది సెకండ్ ట్రైమస్టర్ లేదా మూడవ ట్రైమస్టర్​లో సంభవిస్తుంది. గర్భధారణ సమయంలో ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచడంతో పాటు హార్మోన్లలో కూడా మార్పులు కలిగిస్తుంది. 


హార్మోన్లు ఇన్సులిన్ చర్యకు అంతరాయం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల బరువు కూడా పెరగవచ్చు. ఈ ప్రభావాలను భర్తీ చేయడానికి శరీరం తగినంత ఇన్సులిన్​ను విడుదల చేయదు. ఇది మధుమేహం తాత్కాలిక అభివృద్ధికి దారితీస్తుంది. దీనివల్ల తల్లి, పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో రక్తంలోని చక్కెర స్థాయిలను గమనించండం చాలా ముఖ్యం. 


ఈ మధుమేహంతో ప్రమాదకారకాలు తప్పవు


ఊబకాయం సమస్య పెరుగుతుంది. మాక్రోసోమియా అంటే పిల్లల బరువు అధికంగా ఉండడం, ప్రీక్లాంప్సియా, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, శిశువులో చక్కెర సమస్యలు రావడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ సమస్యను గుర్తించిన వెంటనే ఆహారంలో మార్పులు, రక్తంలో చక్కెరను గుర్తించడం, ఇన్సులిన్ మందులు తీసుకోవడం చేయాలి. ఈ సమయంలో అలసట, చూపు మందగించడం. నోరు పొడిబారిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. 


పిల్లలపై ఎఫెక్ట్ ఉంటుందా?


కచ్చితంగా ఉంటుంది. రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే.. బిడ్డకు కూడా ఈ సమస్య సంభవిస్తుంది. ఇది ప్యాంక్రియాస్ ద్వారా ఎక్కువ ఇన్సులిన్​ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి పిల్లల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన పెరుగుదల మంచిది కాదు. కొందరిలో లోపాలు, వైకల్యం వచ్చే ప్రమాదం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. 


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..


రెగ్యూలర్​గా శరీరంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై ఇబ్బందులు లేకుండా చేస్తుంది. ఆహారం, వ్యాయామం, ఔషధాల ప్రభావాలను పర్యవేక్షించడాన్ని సులభతరం చేస్తుంది. ఈత, నడక లేదా ప్రినేటల్ యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగితే పర్లేదు కానీ.. అనారోగ్యకరమైన రీతిలో పెరిగే బరువును కంట్రోల్ చేయాలి. అధిక బరువు వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. సమస్యల సంభావ్యతను పెంచుతుంది. వైద్యుల సలహా మేరకు హెల్తీ లైఫ్​ను లీడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గర్భంలోని శిశువుకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. పైగా డాక్టర్లు సూచించే మందులను రెగ్యూలర్​గా ఉపయోగింంచవచ్చు. 


Also Read : స్ట్రోక్ రాకుండా హార్ట్​ను రక్షించే హెల్తీ డ్రింక్స్ ఇవే.. ఇలా తయారు చేసుకోండి






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.