Stroke Prevention Tips : గుండె సమస్యకు ప్రధాన కారణాలలో ఒకటి మెరుగైన రక్తప్రసరణ(Blood Circulation) లేకపోవడం. ధమనుల లోపల రక్తం ప్రవహించడం కష్టంగా మారినప్పుడు అది గుండెపోటు లేదా స్ట్రోక్(Heart Stroke) వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రక్త సరఫరాలలో ఆటంకం కారణంగా మెదడు దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ప్రమాద పరిస్థితులను నివారించడానికి.. శరీరంలో సహజంగా రక్తప్రసరణను మెరుగుపరచుకునేందుకు మనం ప్రయత్నించాలి. ఆయుర్వేదం ప్రకారం ఓ సహజమైన పద్ధతి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
కొన్ని మూలికలతో కూడిన పానీయాలు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగై స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే ఇవి కేవలం గుండె ఆరోగ్యాన్నే కాకుండా.. మెరుగైన శరీర పనితీరును అందిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంతకీ ఆ పానీయాలు ఏంటి? వాటిని ఎలా తయారు చేసుకోవాలి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
పాలలో పసుపు..
పసుపు ఆయుర్వేదంలో ఓ ప్రసిద్ధ మూలిక. దీనిలో అపారమైన శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి పసుపును.. గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే చాలా మంచిది. ఇది శరీరంలోని మంటను తగ్గించి.. రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మీరు దీనిలో మిరియాల పొడిని కూడా కలిపి సేవించవచ్చు. దీనిని రాత్రుళ్లు నిద్రపోయే ముందు తాగితే మరింత మంచిది. మంచి నిద్ర కూడా మీ సొంతమవుతంది.
అల్లం టీ
అల్లం శక్తివంతమైన హెర్బ్గా చెప్పవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని సజావుగా నిరోధించడంలో అల్లంటీ మిరాకిల్స్ చేస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్లం టీని తయారు చేసుకుని.. హాయిగా ఆస్వాదించేయండి. వేడి నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించి.. వాటిని వడకట్టి దానిలో కాస్త తేనెను వేసుకుని అల్లం టీని ఆస్వాదించవచ్చు.
దాల్చిన చెక్కతో..
వైవిధ్యమైన ఆరోగ్యప్రయోజనాలకు దాల్చినచెక్క పెట్టింది పేరు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కను నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత లేదా వేడిగా అయినా తీసుకోవచ్చు.
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్లో నైట్రేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రక్తప్రవహాన్ని మెరుగుపరచడంలో, రక్తనాళాలను విస్తరించడంలో సహాయం చేస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. కాబట్టి ఉదయాన్నే లేదా రోజులో ఏదొక సమయంలో తాజా బీట్ రూట్ జ్యూస్‌ని మీరు తీసుకోవచ్చు. ఇది స్ట్రోక్ రిస్క్‌ను తగ్గించి.. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
ఉసిరి రసం
విటమిన్ సి ఉసిరి కాయల్లో పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇది రక్తనాళాలను పెంచడానికి, మెరుగైన రక్తప్రసరణను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. రోగనిరోధకశఖ్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే.. రక్తం గడ్డకట్టడాన్ని.. స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.
రక్త ప్రసరణను మెరుగుపరచుకోవడానికి, గుండె సమస్యలను తగ్గించుకోవడానికి మీరు అశ్వగంధ టీ, తులసి టీలను కూడా తీసుకోవచ్చు. అయితే తులసి టీని మాత్రం పరగడుపునే తీసుకోవాలి. ఈ పానీయాలను రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల సహజంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. వీటితో పాటు వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడం అనేవి కూడా సానుకూల ప్రభావాలు చూపిస్తాయి.
Also Read : బెల్లీఫ్యాట్‌ని కరిగించే కశ్మీరీ టీ.. ఈ రెసిపీలో ఉపయోగించే పదార్థాలు ఏవంటే