వినాయక చవితి వచ్చేసింది. విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుడిని ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఆయనకకు ఆవిరి మీద వండిన వంటలంటే చాలా ఇష్టం. నూనె లేకుండా వండాలని అంటారు. ఈ టేస్టీ ఉండ్రాళ్ల పాయసంలో రెండు స్పూన్ల తేనె తప్ప నూనె వాడాల్సిన అవసరం. చేయడం కూడా చాలా సులువు. నూనెతో వండడం లేదు కాబట్టి ఆరోగ్యకరం కూడా. 


కావాల్సిన పదార్థాలు
పచ్చిశెనగ పప్పు - పావు కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
డ్రై ఫ్రూట్స్ - గుప్పెడు
నీళ్లు - సరిపడినన్ని
బెల్లం తురుము - ఒక కప్పు
ఉప్పు - పావు టీస్పూను
బియ్యం పిండి - ఒక కప్పు
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
పాలు - ఒక కప్పు


తయారీ ఇలా...
1. పచ్చిశెనగపప్పును నీటిలో వేసి ఒక గంట లేదా రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
3. అదే కళాయిలో ఒకటిన్నర కప్పు నీళ్లు, చిటికెడు ఉప్పు, రెండు స్పూన్ల బెల్లం తురుము వేసి కలపాలి. 
4. రెండు స్పూన్ల నానబెట్టిన పచ్చి శెనగపప్పును కూడా కళాయిపై మూత పెట్టేయాలి. ఓ అయిదు నిమిషాలు ఉడికించాలి. 
5. తరువాత అందులో కప్పు బియ్యం పిండి వేసి కలపాలి. చిన్న మంట మీద ఉంచి బాగా కలపాలి. 
6. పిండి నీటినంతా పీల్చుకుని పొడిగా మారుతుంది. చపాతీ పిండిలా మారుతుంది. 
7. స్టవ్ కట్టేసి కళాయి మీద కాసేపు మూత పెట్టేయాలి. 
8. తరువాత తీసి చపాతీ పిండి కలిపినట్టు బాగా కలపాలి. 
9. చిన్న చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. 
10. ఒక గిన్నెల్లో కప్పు నీళ్లు నాలుగైదు ఉండలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 
11. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కప్పు నీళ్లు పోయాలి.
12. ఆ నీళ్లలో చిటికెడు ఉప్పు, మిగిలిన పచ్చి శెనగపప్పు వేసి కళాయిపై మూత పెట్టేయాలి. 
13. అయిదు నిమిషాల తరువాత కప్పు బెల్లం తురుము వేయాలి. 
14. బెల్లం బాగా కరిగాక చుట్టి పెట్టుకున్న ఉండ్రాళ్లు వేసేసి మూత పెట్టేయాలి. 
15. పావు గంటసేపు చిన్న మంటమీద ఉడికించాలి. 
16. తరువాత నీళ్లలో కలిపి పెట్టుకున్న కొబ్బరి ముక్కల మిశ్రమాన్ని (10వ పాయింట్) కూడా వేసి కలపాలి. 
17. రెండు నిమిషాలు ఉడికాక, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసేయాలి. తరువాత స్టవ్ కట్టేయాలి. 
18. ఉండ్రాళ్ల మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేసి, కాచి చల్లార్చిన కప్పు పాలను కలపాలి. 
19. టేస్టీ ఉండ్రాళ్ల పాయసం. ఇలా చేస్తే రుచి మామూలుగా ఉండదు. ఈ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే కోరిన కోరికలు ఆ వినాయకుడు తీర్చేస్తారు. 


Also read: వినాయక చవితికి స్నేహితులను ఇలా విష్ చేయండి


Also read: బొజ్జ గణపయ్య కోసం నైవేద్యంగా పాల తాలికలు, చేయడం చాలా సులువు