తెలుగింటి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. భాద్రపద మాసం శుక్ల చతుర్ధి నాడు హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ఆరంభమవుతాయి. ఆ విఘ్నేశ్వరుడిని పూజించి సకల శుభాలు, విజయాలు, సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటారు భక్తులు. ఈ రోజున అయిదు లేదా తొమ్మిది నైవేద్యాలతో ఆ స్వామి వారిని పూజించి కరుణా కటాక్షాలను పొందుతారు. ముందుగా చేసే పని మాత్రం పండుగ రోజున స్నేహితులను, కుటుంబసభ్యులను విష్ చేయడం. వాట్సాప్ వినాయక చవితి శుభకాంక్షలతో నిండిపోతుంది. తెలుగులోనే చక్కని కోట్స్ ను మీ స్నేహితులకు,కుటంబ సభ్యులకు పంపి ఆనందాన్ని పంచుకోండి. ముందుగా మీకు ఏబీపీ దేశం తరుపున వినాయకచవితి శుభాకాంక్షలు.
1. బొజ్జ గణపయ్య మీ కోరిన కోరికలన్నింటినీ
నెరవేర్చి, మీకు సకల విజయాలను అందించాలని కోరుకుంటున్నా.
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
2. ఆ లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా
మీ కష్టాలను విజయాలుగా మార్చాలని,
కారుమబ్బులు కమ్మిన జీవితాల్లో
ఇంద్రధనుసులు విరిసేలా చేయాలని కోరుకుంటూ..
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు
3. వినాయకుని నైవేద్యాలు ఎంత తియ్యగా ఉంటాయో...
మీ జీవితం కూడా అంతే తియ్యగా మారాలని కోరుకుంటూ
మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు
4. సకల విఘ్నాలు తొలగించే ఆ గణేశుడి ఆశీస్సులు
మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ...
మీ కుటుంబసభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
5. ఆ విఘ్నేశ్వరుడు మీ కష్టాలను తొలగించి,
మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం...
అందివ్వాలని కోరుకుంటూ
హ్యాపీ వినాయక చవితి
6. ఆ విఘ్నేశ్వరుడు మీరు చేపట్టిన పనులన్నీ
విజయవంతం చేయాలని, మీ ఇంట్లో సుఖసంతోషాలు
వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
హ్యాపీ వినాయక చతుర్ధి.
7. ఏకదంతం మహాకాయం
తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం
వందేహం గణనాయకమ్
హ్యాపీ వినాయక చతుర్థి
8. మీరు చేసే ప్రతికార్యం
ఆ వినాయకుడి ఆశీస్సులతో
విజయం కావాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు
9. అగజానన పద్మార్కం
గజాననమ్ అహర్నిశం
అనేకదంతం భక్తానాం
ఏకదంతమ్ ఉపాస్మమే
వినాయక చవితి శుభాకాంక్షలు
10. ఆ విఘ్నాధిపతి మీకే క్షేమ, స్థైర్య
ఆయురారోగ్యాలు సిద్ధించాలని
సుఖసంతోషాలు చేకూర్చాలని
మనస్పూర్తిగా కోరుకుంటున్నా
వినాయక చతుర్ధి శుభాకాంక్షలు
11. ఓం వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వకార్యేషు సర్వదా
వినాయక చవితి శుభాకాంక్షలు
12. శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయే
త్సర్వ విఘ్నోప శాంతయే
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
13. మీరు చేసే ప్రతికార్యం
ఆ వినాయకుడి ఆశీస్సులతో
విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున
మీరంతరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ...
వినాయక చవితి శుభాకాంక్షలు
14. ఆదిపూజ్యుడికి అభివందనం..
పార్వతీనందనుడికి ప్రియవందనం..
ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి
అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం
ఓ విఘ్నేశ్వరాయ నమ:
15. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ
అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ...
మట్టి గణపయ్యను పూజిద్ధాం...
మీకు, మీ కుటుంబసభ్యులకు వినాయక వితి శుభాకాంక్షలు
Also read: బొజ్జ గణపయ్య కోసం నైవేద్యంగా పాల తాలికలు, చేయడం చాలా సులువు
Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి