దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్కెట్లో అమ్మకానికి ఉంచిన వినాయక విగ్రహాలను తీసుకువచ్చి పండుగ చేసుకున్నారు. మరికొందరు ఎకో ఫ్రెండ్లీ అని, మరికొందరు అవగాహన కోసం రకరకాల వినాయక విగ్రహాలను తయారు చేశారు. 


Alos Read: vinayaka Chavithi: ఈ అష్ట వినాయకులను దర్శిస్తే... విజయాలన్నీ మీవే


గుజరాత్‌కి చెందిన రాధిక సోని ఫుడ్ వేస్టేజ్ పై అవగాహన కల్పించేందుకు వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక మండపాన్ని రూపొందించింది. ఇందుకోసం ఆమె ఫుడ్ ప్యాకెట్స్‌ని ఎంచుకుంది. 5 అడుగుల శివలింగాన్ని తీర్చిదిద్దేందుకు 1008 బిస్కెట్ ప్యాకెట్లు, 850 రుద్రాక్షలు తీసుకుంది. వీటితో లింగాన్ని ఏర్పాటు చేసి మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచింది. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. వినాయకుడి బొమ్మ నిమజ్జనం అనంతరం ఈ బిస్కెట్ ప్యాకెట్లను పూర్ చిల్డ్రన్‌కి  అందజేయనున్నట్లు తెలిపింది. 


Alos Read: Naramukha Ganapathi : పార్వతీ దేవి తయారు చేసిన గణపయ్య నిజ రూపం చూశారా..గజముఖం పెట్టకముందు తొండం లేకుండా వినాయకుడు ఎలా ఉన్నాడో చూసి తరించండి..



ఫుడ్ వేస్టేజ్ పై తనకు జరిగిన ఓ అనుభవాన్ని ఈ సందర్భంగా రాధిక పంచుకుంది. ఓ సారి తన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే చాలా ఫుడ్ మిగిలిపోయిందట. ఆ ఫుడ్‌ని డొనేట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. దేశంలో ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు. అందుకే Don't Waste Food అనే మెసేజ్‌తో ఈ సారి వినాయక చవితి వేడుకలు నిర్వహించినట్లు ఆమె తెలిపింది. రాధిక చేపట్టిన ఈ కార్యక్రమానికి చుట్టు పక్కల వారు హర్షం వ్యక్తం చేశారు. 


Alos Read: Divine Flowers: ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మంచిది?


Food Waste Index Report 2021 ప్రకారం ప్రతి పనిషి ఏడాది 50 కేజీల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ లెక్కన మనదేశంలో పెద్ద మొత్తంలోనే ఫుడ్ వేస్టు అవుతుందన్నమాట. వీలైనంత వరకు ఫుడ్ వేస్టేజ్‌ని కంట్రోల్ చేసేందకు అందరూ తమ వంతు ప్రయత్నం చేయాలి అని ఈ సందర్భంగా రాధిక కోరింది.  


Alos Read: Madhura Nidhivan Temple: అర్థరాత్రి వేణుగానం, గజ్జెల శబ్దాలు…ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యం..ఆ ఆలయంలో చీకటి పడ్డాక ఏం జరుగుతుంది..!


Also Read: Dasara Festival 2021: అక్టోబర్ 7నుంచి దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు- దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్‌