అష్టవినాయకులు అనగానే ఒక్కోటి ఒక్కో రాష్ట్రంలో ఉందేమో అనుకోవద్దు. ఈ అష్ట వినాయకు ఆలయాలన్నీ పుణెలకు దగ్గర్లోనే ఉన్నాయి. కేవలం వంద కిలోమీటర్ల పరిధిలో ఈ ఎనిమిది ఆలయాలు పరుచుకుని ఉన్నాయి. కనుక పుణె చేరుకుంటే ఈ అష్ట వినాయకులను దర్శించుకుని వచ్చేయచ్చు. ఒక్కొక్క ఆలయంలో వినాయకుడు ఒక్కొక్క రూపంలో పూజలందుకుంటాడు. ఆ ఆలయాలు పేర్లేంటో, అవి పుణెకు ఎంతదూరంలో ఉన్నాయో చూద్దాం. 


1.  అష్టవినాయక మందిరం
ఇది పుణెకు 80 కిలోమీటర్ల దూరంలోని మోరేగావ్ లో ఉంది. 
2. సిద్ధివినాయక మందిరం
ఇది పుణెలకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాటెక్ గ్రామంలో ఉంది. 
3. బల్లాలేశ్వర ఆలయం
పుణె నుంచి పాలి గ్రామానికి 119 కిలోమీటర్ల. పాలి గ్రామంలో ఈ ఆలయం కొలువుదీరి ఉంది.
4. వరద వినాయక మందిరం
పుణె నుంచి 130 కిలోమీటర్ల దూరం మహాడ్ ప్రాంతంలో ఉంది ఈ గుడి. 
5. చింతామని మందిరం
పుణె నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న తియూర్ గ్రామంలో కొలువుదీరింది. 
6. గిరిజాత్మజ మందిరం 
పుణె నుంచి 97 కిలోమీటర్ల పరిధి ఉన్న లేయాంద్రి గ్రామంలో ఉంది. 
7. విఘ్నహర మందిరం, 
పుణె నుంచి 223 కిలోమీటర్ల దూరంలో ఒజార్ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. 
8. మహాగణపతి మందిరం
పుణె నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంజనగావ్ లో కొలువుదీరింది ఈ ఆలయం. 


ఈ ఆలయాలన్నీ చూడడానికి రెండు రోజులు పడుతుంది. ఈ అష్టవినాయకులు దర్శించాలని అనుకునేవారు మొదట మోరేగావ్ లోని అష్టవినాయక మందిరాన్ని దర్శించుకుని ప్రయాణం మొదలుపెట్టాలి. 


ఇతర ప్రసిద్ధ ఆలయాలు
ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం, కేరళలోని తిరుచిరాపల్లిలో ఉన్న ఉచ్చి పిళ్లైయారై కొట్టై, బీహార్ లోని బైద్యనాథ్ లో, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న వినాయక ఆలయం, వారణాసిలో ఉన్న ధుండిగజ్ మందిరం కూడా చాలా ప్రసిద్ధమైనవి. 


విదేశాలలోనూ....
ఇప్పటి జావా, సుమత్రా, ఇండోనేషియాలను పూర్వం హిందూ రాజులే పాలించారని చెబుతారు. అందుకే అక్కడ భారీ స్థాయిలో హిందూ దేవతల ఆలయాలు బయటపడ్డాయి. వాటిలో వినాయకుని ఆలయాలే ఎక్కువ. తూర్పు జావాలోని ‘తులసికాయో’ అనే గ్రామంలో ఉన్న బారా దేవాలయంలో మూడు మీటర్ల ఎత్తున్న గణేశుడు కొలువు దీరాడు. థాయ్ లాండ్లోని బ్యాంకాక్ లో ఉన్న వినాయక ఆలయాన్ని ప్రతి శివరాత్రికి భారీగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు. మారిషస్, సింగపూర్ లలో కూడా బొజ్జగణపతికి గుడులు ఉన్నాయి. మెక్సికో, గ్వాటిమాలా, పెరూ, బొలీవియాలలో గణేశుడికి సంపన్న దేవాలయాలున్నాయి.   


Also read: వినాయక చవితి పూజ ఎలా చేయాలి.. అసలు మంత్రాలు ఏంటి?