Fans were Intrigued by the Garlic Cloves on Priyankas Feet : వెల్లుల్లితో కాళ్లకు మసాజ్ చేసుకుంటూ.. దానికి సంబంధించిన వీడియోను ప్రియాంక ఇన్​స్టాలో షేర్ చేసింది. అసలు వెలుల్లిని కాళ్లకు ఎందుకు రాస్తుందంటూ.. కొందరు కామెంట్స్ చేస్తుంటే.. అయ్యో.. దీనితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ మరికొందరు దానికి రిప్లై ఇస్తున్నారు. ఇంతకీ వెల్లుల్లిని ఇలా కాళ్లకు రాస్తే ఏమవుతుంది? దీనివల్ల నిజంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.


పురాతన వైద్య ప్రక్రియ


బాలీవుడ్​ హీరోయిన్​గా ఓ స్టాండర్డ్స్ సెట్ చేసింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం గ్లోబల్ ఐకాన్​గా మారి హాలీవుడ్​లో కూడా సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామ ప్రస్తుతం పారిస్​లో ఓ షూటింగ్​లో ఉంది. దానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఆమెకు కొన్ని గాయాలు కాగా.. దానికి ఆమె ఓ హోమ్ రెమిడీ ఫాలో అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్​గా మారింది. పచ్చివెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి.. దానిని కాలికి అప్లై చేసింది. ఇదో పురాతనమైన వైద్య ప్రక్రియగా చెప్తున్నారు నిపుణులు. 


ఇలా అప్లై చేసుకోవాలి..


అవును పచ్చివెల్లుల్లిని కాలికి రుద్దడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయంటున్నారు వైద్య నిపుణులు. ఇది గాయాలను నయం చేయడంతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుందని తెలిపారు. అందుకే వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తీసి.. వాటిని కచ్చాపచ్చాగా దంచి.. దానిలో కాస్త కొబ్బరి నూనె రాసి కాళ్లకు అప్లై చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. అవేంటంటే.. 


ఇమ్యూనిటీ పెరుగుతుందట..


వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. నేరుగా వెల్లుల్లిని తీసుకోవడం ఇష్టంలేనివారు ఈ విధంగా కాళ్లకు అప్లై చేసినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయట.


సీజనల్ వ్యాధులు దూరం


జలుబు, ఫ్లూ, దగ్గు వంటి లక్షణాలు ఓసారి వస్తే అంత సులువుగా వదిలించుకోలేము. ఆ సమయంలో దీనిని అప్లై చేస్తే ఈ లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. పిల్లలపై కూడా ఇది ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. జ్వరం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చంటున్నారు. వెల్లుల్లిలోని సమ్మేళనాలు పాదం ద్వారా రక్తంలోకి చేరి.. వాటి ప్రయోజనాలు అందిస్తాయని ఔషదశాస్త్రం చెప్తోంది. 


స్కిన్ అలెర్జీలను దూరం చేస్తుందట


వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా అల్లిసిన్ ఉంటుంది. వీటిని పాదాలపై మసాజ్ చేసినప్పుడు.. చర్మంపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్​ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఎండవల్ల కలిగే అలెర్జీలను కూడా ఇది దూరం చేస్తుంది. 


మెరుగైన రక్తప్రసరణకై


వెల్లుల్లిని పాదాలకు అప్లై చేయడంవల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల స్కిన్​ గ్లో అవడంతో పాటు.. జుట్టు పెరుగుదల కూడా ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అప్లై చేస్తే పాదాలు వేడెక్కి.. వెచ్చదనాన్ని అందిస్తాయి. 


డిటాక్స్ చేయడానికి..


ఆరోగ్యంగా ఉండేందుకు శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా అవసరం. వెల్లుల్లిని పాదాలకు అప్లై చేయడం వల్ల టాక్సిన్స్ పోవడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని అరోమా థెరపీ కూడా చాలా మంచిది అంటున్నారు. ఇది శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 


వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ.. దీనిని వినియోగించేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలంటున్నారు. లేకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశముందనిచెప్తున్నారు. అందుకే హెల్తీగా ఉండాలని సూచిస్తున్నారు. 


Also Read : మీ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తున్నారా? ఇవి ఫాలో అయితే యంగ్​గా కనిపిస్తారు







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.