Mosquito Diseases in Summer : వేసవి కాలంలో చికాకు కలిగించే విషయాల్లో దోమలు ఒకటి. ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. వేసవిలో వేడివల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇవి మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందిస్తాయి. అందుకే దోమలనుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా చిన్నపిల్లలకు దోమల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాధులు వ్యాపించకుండా.. దోమలను ఏవిధంగా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


దోమలు రాకుండా వాటిని ఉపయోగించవచ్చు


సమ్మర్​లో గాలికోసం చాలామంది డోర్స్, విండోస్​ తీసిపెడుతూ ఉంటారు. ఆ సమయంలో గాలితో పాటు దోమలు కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు డోర్స్​కి, కిటికీలకు దోమలు రాకుండా మెస్ పెట్టవచ్చు. దోమల రిప్లెంట్స్ ఉపయోగించవచ్చు. ఇవి దోమలతో పాటు.. ఈగల బెడదను కూడా తగ్గిస్తాయి. పైగా మిమ్మల్ని మీరు దోమల నుంచి రక్షించుకోవడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. డీఈఈటీ, పికారిడిన్ లేదా నిమ్మకాయ, యూకలిప్టస్ నూనెను కూడా మీరు దోమలను తగ్గించుకోవడం కోసం వినియోగించవచ్చు. ఇవి దోమలకు వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. 


వాటిని ఉపయోగించకపోవడమే మంచిది..


తెల్లవారు జామున, సాయంకాలం దోమలు బాగా యాక్టివ్​గా ఉంటాయి. ఆ సమయంలో పిల్లలకు కాటన్ దుస్తులను ఫుల్​ హ్యాండ్స్ ఉన్నవి వేయాలి. పెద్దవారు కూడా ఫుల్​గా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. లేదంటే సాక్స్​లు వేసుకోవాలి. ఇవి దోమకాటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సువాసన కలిగిన సబ్బులు, పెర్ఫ్యూమ్స్​, లోషన్స్ దోమలను ఆకర్షిస్తాయి. కాబట్టి సువాసన లేని ఉత్పత్తులను ఎంచుకుంటే దోమల బెడద తగ్గుతుంది. సిట్రోనెల్లా కొవ్వొత్తులు బయట నుంచి లోపలికి వచ్చే దోమలను నిరోధిస్తాయి. 


సమ్మర్​లో బయట పడుకుంటున్నారా?


సమ్మర్​లో ఇంట్లో వేడి ఎక్కువైతే టెర్రస్​, ఆరుబయట పడుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపుతారు. బయట దోమలు ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి.. మీరు పడుకునే ప్రాంతంలో దోమల తెరలు కట్టుకోండి. చల్లని గాలిలో దోమల బెడదలేకుండా హాయిగా పడుకోవచ్చు. 
సమ్మర్​లో మొక్కలకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. పక్షులకు కూడా నీరు పోసి పెడుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో నీరు నిలిచిపోతుంది. దీనివల్ల దోమలు బెడద మరింత పెరుగుతుంది. కాబట్టి పూల కుండీలు, మొక్కల దగ్గర నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లేదంటే దోమలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. చెత్త ఎక్కువగా ఉంటే.. దోమలు పెరుగుతాయి. కాబట్టి అలాంటివేమి లేకుండా ఇంటి చుట్టూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. 


Also Read : ఎప్పుడూ హెల్తీగా, ఫిట్​గా ఉండాలంటే.. ఈ 10 సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి