Top 10 Tips for Healthy Lifestyle : హెల్తీగా, ఫిట్​గా ఉండాలని అందరూ అనుకుంటారు. దానికోసం తెగ కష్టపడిపోవాలేమో అనుకుంటారు. కానీ రెగ్యూలర్​గా మనం కొన్ని ఫాలో అవ్వడం వల్ల హెల్తీగా ఉండడమే కాకుండా.. బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు. రెగ్యూలర్​గా వ్యాయామాలు చేయడం, పోషకాలతో కూడిన ఫుడ్ తీసుకోవడం, షుగర్, ఆల్కహాల్​కు దూరంగా ఉండడం వంటి మంచి జీవనశైలిని ప్రోత్సాహిస్తాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయి. హెల్తీ లైఫ్​ స్టైల్​ని అందించే పది సింపుల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


రెగ్యూలర్ వ్యాయామం..


వ్యాయామం చేయడానికి సమయం లేదా అయితే చిన్న, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. వీటివల్ల మీరు కేవలం బరువు తగ్గడమే కాదు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. వ్యాయామం మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. ఎముకలను, కండరాలను ధృడంగా చేస్తుంది. మెరుగైన నిద్రను అందిస్తుంది. గుండె జబ్బులు, షుగర్ వంటి సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది. 


హైడ్రేటెడ్​గా ఉండండి..


సమ్మర్​ అయినా కాకున్నా.. నిరంతరం హైడ్రైటేడ్​గా ఉంటే మంచిది. ఇది కేవలం దాహం తీర్చడమే కాదు.. శరీరం, మెదడును కూడా ఉత్తేజపరుస్తుంది. మీరు యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడం, కీళ్లనొప్పులు దూరం చేయడం, శరీరాన్ని డిటాక్స్ చేయడం వంటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోండి. హైడ్రెట్​గా ఉంచే ఫుడ్స్ తీసుకున్నా మంచిదే. 


బయటకు వెళ్లండి


వర్క్​ ఫ్రమ్ హోమ్ చేసేవారిలో చాలామంది రూమ్​లకే పరిమితమైపోతున్నారు. అలాంటివారు కూరగాయల కోసమో.. పెట్స్ కోసమో.. లేదంటే ఈవెనింగ్ వాక్​ కోసమో బయటకు వెళ్తూ ఉండాలి. ఇది మిమ్మల్ని మానసికంగా ఉత్తేజ పరుస్తుంది. స్వచ్ఛమైన గాలి మీరు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. ఉదయానే విటమిన్ డి కోసం ఎండలో కూర్చొన్నా మంచిదే. విటమిన్ డి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. 


పోషకాలతో నిండిన ఆహారం


హెల్తీగా ఉండడంలో మొదలుకుని.. బరువును అదుపులో ఉంచడంలో బరువు ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమతుల్యమైన ఆహారం మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా.. బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్, నట్స్, ప్రోటీన్​ కలిగిన ఫుడ్స్ మీ డైట్​లో చేర్చుకుంటే మంచిది. విటమిన్స్, మినరల్స్, పీచుతో కూడిన ఫుడ్స్ మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి. 


ప్రాసెస్ చేసిన ఫుడ్​ వద్దు


పోషకాలు కలిగిన ఫుడ్స్ తీసుకోవడం మంచిదే కానీ.. ప్రాసెస్ చేసిన వాటితో పోషకాలు పొందాలి అనుకోకూడదు. ప్రాసెస్ చేసిన ఫుడ్​లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉప్పు, చక్కెర మోతాదుకు మించి ఉంటాయి. తినేందుకు టేస్టీగానే ఉన్నా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి. ఫాస్ట్ ఫుడ్​ను, ప్యాక్ చేసిన ఫుడ్​కి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. 


స్క్రీన్ సమయం


పనికోసం ల్యాప్ టాప్, రిఫ్రెష్​మెంట్ కోసం ఫోన్. ఇలా చాలామందిలో స్క్రీన్ టైమ్ పెరిగిపోతుంది. ఇది కేవలం కంటికే కాదు మీ మొత్తం శరీరానికి చెడు చేస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. రోజంతా కూర్చోని చేయాల్సిన పని ఉంటే మీరు కాసేపు దానికి విరామం తీసుకోండి. ఇది మీరు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. 


నిద్రలేకుంటే ఏమి చేసినా వేస్టే


మంచి నిద్ర అనేది మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని, బరువును, మానసిక ప్రయోజనాలు అందిస్తుంది. నిద్రపోయేప్పుడు శరీరం అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేస్తుంది. శారీరక విధులు చేయడం, కండర కణజాలాన్ని సరిచేయడం, మెదడును ప్రాసెస్ చేయడం, శక్తిని అందిచడం వంటి పనులు చేస్తుంది. నిద్రలేకుంటే ఇవన్నీ శరీరానికి అందక.. హెల్త్ కరాబ్ అవుతుంది. దానివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. గుండె జబ్బులు, మధుమేహం సమస్యలకు దారితీస్తుంది. 


ఆల్కహాల్, ధూమపానం తగ్గిస్తే మంచిది


చాలామందికి స్మోకింగ్, డ్రింకింగ్ అనేది ఫ్యాషన్​గానే ప్రారంభమవుతుంది. కానీ అవి అలవాటు అయితే వదిలించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. వీటి వినియోగం ఎక్కువైతే క్యాన్సర్​కు దారితీస్తాయి. మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలంటున్నారు. 


మల్టీవిటమిన్స్ తీసుకోండి


కొన్ని విటమిన్స్​ వివిధ ఫుడ్స్​ ద్వారా తీసుకోలేకపోతుంటే.. వాటిని మెడిసన్ రూపంలో తీసుకోండి. మల్టీ విటమిన్స్ శరీరానికి అవసరమైన విటమిన్స్, పోషకాలను అందిస్తాయి. అయితే వీటిని వినియోగించే ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి. 



రెగ్యూలర్ చెకప్స్


వైద్య పరీక్షలు రెగ్యూలర్​గా చేయించుకోవడం వల్ల సమస్యను త్వరగా గుర్తించగలుగుతారు. కాబట్టి చికిత్సతో వాటిని క్యూర్ చేసుకోవచ్చు. ఏదో సమస్య వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరకు వెళ్లడం కాకుండా.. ఆరునెలలకు ఓసారి హెల్త్ చెకప్స్ చేయించుకుంటే హెల్త్​కి మంచిది. 


ఈ రెగ్యూలర్ టిప్స్​ ఫాలో అయితే.. మీరు హెల్తీగా ఉండడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రావు. ఒకవేళ ఇప్పటికే అవి ఇబ్బంది పెడుతున్నా.. వాటి సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా బరువు కూడా అదుపులో ఉంటుంది. 


Also Read : రాత్రుళ్లు చాక్లెట్స్, ఐస్​క్రీమ్స్ తినాలని అనిపిస్తుందా? అయితే దానికి కారణం అదే