Stock Market Today, 23 April 2024: గ్లోబల్‌ పీర్స్‌ ట్రెండ్‌ను బట్టి, ఈ రోజు (మంగళవారం) దేశీయ ఈక్విటీ మార్కెట్‌ మీద పెద్దగా ఒత్తిళ్లు లేవు. 


సోమవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,336 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,405 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో.. ఈ ఉదయం జపాన్‌కు చెందిన నికాయ్‌ ఆకుపచ్చ రంగుతో 0.38 శాతం, టోపిక్స్ ఇండెక్స్ 0.50 శాతం పెరిగాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.28 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాలోని S&P/ASX 200 0.52 శాతం యాడ్‌ చేసుకోగా, హాంకాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ 0.63 శాతం ఎగబాకింది. 


USలో నిన్న మూడు సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.67 శాతం జోడిస్తే, S&P 500 0.87 శాతం పెరిగింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1.11 శాతం ర్యాలీ చేసింది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.619 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $87 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గోల్డ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది, ఔన్సుకు $2,326 దగ్గర ఉంది. 
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ICICI ప్రుడెన్షియల్, టాటా ఎల్‌క్సీ, మహీంద్ర & మహీంద్ర ఫైనాన్స్, MCX, సైయెంట్‌ DLM, 360 వన్‌ WAM


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల విషయంలో మార్కెట్‌ అంచనాలు తప్పాయి. అధిక పన్ను వ్యయాల కారణంగా Q4FY24లో ఈ కంపెనీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 1.8 శాతం తగ్గింది, రూ. 18,951 కోట్లకు చేరింది. QoQలో ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. ఆదాయం ఏడాదిలో రూ. 2.37 ట్రిలియన్లకు, 11.1 శాతం పెరిగింది. త్రైమాసికం ప్రాతిపదికన 5.1 శాతం పెరిగింది.


నిన్న Q4 ఫలితాలు ప్రకటించిన మరికొన్ని కంపెనీలు: ఆర్తి సర్ఫేస్‌టాంట్స్‌, ఆదిత్య బిర్లా మనీ, తేజస్ నెట్‌వర్క్స్, హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్, మహీంద్ర లాజిస్టిక్స్, టాన్‌ఫాక్ ఇండస్ట్రీస్, రాలిస్ ఇండియా, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. వీటిపైనా మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: రాయిటర్స్ రిపోర్ట్‌ ప్రకారం, అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్‌షోర్ ఫండ్స్‌ నిబంధనలను ఉల్లంఘించాయని, పెట్టుబడి పరిమితులను మించాయని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కనిపెట్టంది. వీటిలో ఎనిమిది ఆఫ్‌షోర్ ఫండ్స్‌, పెనాల్టీ చెల్లిస్తామంటూ సెబీకి వ్రాతపూర్వక అభ్యర్థనను సమర్పించాయి.


పేటీఎం: UPI చెల్లింపుల కోసం, UPI & క్రెడిట్ కార్డ్ కోసం రెండు మేడ్-ఇన్-ఇండియా సౌండ్‌బాక్స్‌లను సోమవారం లాంచ్‌ చేసింది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: జపాన్‌కు చెందిన మిత్సుబిషి యుఎఫ్‌జె ఫైనాన్షియల్ గ్రూప్ (MUFG), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాన్ బ్యాంకింగ్ యూనిట్‌లో మైనారిటీ వాటా కోసం 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి కోసం ప్రయత్నిస్తోంది. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 20 శాతం వాటా కోసం నెల రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.


విప్రో: ఈ కంపెనీ స్టెప్-డౌన్ యూనిట్ సింక్రోనీ గ్లోబల్ మూతబడింది.


హీరో మోటోకార్ప్: CTO అరుణ్ జౌరా ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి వచ్చేలా తన పదవికి రాజీనామా చేశారు.


పటేల్ ఇంజినీరింగ్: రూ.500 కోట్ల వరకు సమీకరించేందుకు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్‌ను (QIP) ప్రారంభించింది. ఒక్కో షేరు ధరను రూ. 59.50గా నిర్ణయించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: అమాంతం దిగొచ్చిన గోల్డ్‌ రేట్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే