Krishna Mukunda Murari Today Episode: కృష్ణ, మురారి హాల్‌లో దిగులుగా కూర్చొంటారు. కృష్ణకి అసలు విషయం తెలిస్తే చాలా తట్టుకోలేదని.. పెద్దమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని కుమిలిపోతుందని మురారి అనుకుంటాడు. ఇంతలో భవానితో పాటు అందరూ అక్కడికి వస్తారు.
భవాని: అది నార్మల్ కడుపునొప్పే కదా మరి మీరిద్దరూ ఎందుకు ఇంత డల్‌గా ఉన్నారు.
రేవతి: మీరు ఇలా ఉంటే మాకు భయం వేస్తుంది. నిజం చెప్పండి మీరు మా దగ్గర ఏం దాయడం లేదు కదా.. ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా..
మురారి: ప్రాబ్లమ్ ఏం ఉంటుంది అమ్మ. ఏం లేదు.
రజిని: కానీ మీ వాలకం చూస్తే అలా లేదు. నెలలు నిండి జరగరానిదేదో జరిగి కడుపుపోతే ఎలా ఉంటారో అలా ఉన్నారు.
భవాని: రజిని.. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా..
రజిని: నా మాట తీరే ఇంత వదినా నీకు తెలుసు కదా.. అయినా వాళ్లని చూస్తే నీకు అలా అనిపించడంలేదా..
ముకుంద: నోటి దురుసుతో చెప్పినా నిజమే చెప్పింది కాకపోతే వచ్చిన కడుపు పోవడం కాదు. కడుపే వచ్చే పరిస్థితి పోయింది.
రేవతి: మీరు ఇలా ముఖాలు ముడుచుకొని ఉంటే అందరూ ఇలాగే అంటారు.
మురారి: అది నన్ను కాదు నీ కోడలిని అడుగు.. పరిమళ చెప్పింది కదా ఏం జరగదు అని ఎందుకు ఇలా డల్‌గా ఉన్నావ్..
భవాని: ఏమ్మా ఇంకా కడుపు నొప్పి తగ్గలేదా..
కృష్ణ: చాలా భయం వేసింది అత్తయ్య.. నేను బతుకుతానో లేదో అని .. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానో లేదో అని.. ఏవేవో ఆలోచినలు.. ఎందుకో తెలీదు. ఇంకా ఆ భయం వెంటాడుతున్నట్లే ఉంది.
భవాని: పిచ్చిపిల్ల పైకి ధైర్యంగా కనిపిస్తావ్ కానీ లోపల అన్నీ భయాలే..
మధు: కృష్ణ నీ మైండ్ నుంచి భయాలు తీసేయ్. ఆ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టాను చూశావా.. అక్కడ ఆ ఫొటో ఫిక్స్ అయినట్లు.. నువ్వు పెద్ద పెద్దమ్మకు ఇచ్చిన మాట కూడా ఫిక్స్ అయినట్లే. ప్రపంచం తలకిందులైనా సరే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావ్.
ముకుంద: మనసులో.. ఏంట్రా నిలబెట్టుకునేది దాని ముఖం నీ ముఖం వారం రోజుల్లో గర్భసంచి తీసేస్తున్నారు. ఇక అది జన్మలో తల్లి అవ్వలేదు.
భవాని: వాడు చెప్పింది విన్నావు కదా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు.
మరోవైపు రేవతి ఏదో ఆలోచిస్తూ కంగారు పడుతుంది. అది చూసిన మధు రేవతికి ధైర్యం చెప్తాడు. ఇక రేవతి తాను అదర్శ్ గురించి ఆలోచిస్తున్నా అని చెప్తుంది. ఆ మాట విన్న ముకుంద ఏం మాట్లాడుకుంటారా అని చాటుగా నిల్చోంటుంది.
రేవతి: కృష్ణకు ఇంత బాలేదా.. మనం టెన్షన్‌లో ఉంటే వాడు వచ్చి పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. అని ఆదర్శ్ తనతో చెప్పిన మాటలు మధుకి చెప్తుంది. ముకుంద విని షాక్ అయిపోతుంది. కృష్ణ ఆరోగ్యం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అంటే వాడికి ఇంకా కృష్ణ మీద కోపం పోలేదు. ఏం చేయాలో వాడిని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు.
ముకుంద: మనసులో.. ఏం చేసినా ఎంత మనసు మార్చినా కృష్ణ విషయంలో మారాడు కానీ నా విషయంలో మారడం లేదు. అసలు రూపం మార్చుకున్న నన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన రావడం ఏంటి. నోవే ఆదర్శ్‌ని డైవర్ట్ చేయాలి అంతకు ముందు నేను నా పని చేయాలి..
మరోవైపు కృష్ణ పడుకొని ఉంటే మురారి పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ మాటలు తలచుకొని బాధ పడతాడు. కృష్ణకు ఈ నిజం ఎలా చెప్పను అని బాధ పడతాడు.
మురారి: అన్నీ కష్టాలు తట్టుకొని అందరి మనసులు గెలుచుకొని అందరూ నీ మీద ఆశలు పెట్టుకునే స్థాయికి ఎదిగిన తర్వాత ఏ ఆడదానికి రాకూడని కష్టం ఇచ్చాడు నీకు ఆ దేవుడు. ఎలా తట్టుకుంటావ్.. చెప్తే ఏమైపోతావ్ అని భయంగా ఉంది.
కృష్ణ: ఏమైంది ఏసీసీ సార్.. ఏడుస్తున్నారు ఎందుకు ఏసీపీ సార్..
మురారి: నేను ఎందుకు ఏడుస్తాను.. కంట్లో ఏదో పడింది..
కృష్ణ: కాదు ఏదో అయింది. ఎందుకు ఏడుస్తున్నారు. నాకు ఏమైనా అయిపోతుంది అని భయపడుతున్నారా.. మీ వాలకం చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. ఫోన్ ఇవ్వండి పరిమళకు ఫోన్ చేస్తా..
మురారి: అలా ఏం లేదు కృష్ణ. పొద్దున్న నీకు కడుపు నొప్పి వచ్చింది కదా.. నీ బాధ గుర్తొచ్చి కన్నీళ్లు వచ్చాయి.
కృష్ణ: ఏసీపీ సార్ నాకు అయితే ఎప్పుడు పెద్దత్తయ్య చేతిలో బిడ్డ పెడతానా అని ఉంది. కానీ దానికంటే ముందు నేను నెలతప్పాలి. తర్వాత తొమ్మిది నెలలు ఎదురు చూడాలి. అందుకే కుంతీ దేవిలా మంత్రం చదివి వెంటనే చేతిలో బిడ్డను పట్టుకోవాలి అనిపిస్తుంది. ఎందుకు అలా చూస్తారు. అనండి నువ్వు తింగరివి అన్నీ తింగరి ఆలోచనలే అని..
మురారి: మనసులో.. లేదు ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగా అలాంటి మంత్రం ఉండి.. పిల్లలు కలిగితే బాగున్ను అని..
కృష్ణ: కానీ ఇప్పుడు అలాంటి మంత్రాలు లేవు కదా.. మీరు చెప్పిన మంత్రమే చదువుదాం. అదే ప్రేమ మంత్రం. గట్టిగా చదువుదాం..
మురారి: సరే చదువుదాం.. రెస్ట్ తీసుకో.. మనసులో.. పరిమళ చెప్పిందే కరెక్ట్ కృష్ణ బిడ్డను కనడం కంటే నిన్ను కాపాడుకోవడమే ముఖ్యం. నాలుగు రోజులు ఉంది ఈ లోపు నిన్ను మెంటల్‌గా రెడీ చేసి నిజం చెప్పాలి.
ముకుంద డాక్టర్ వైదేహికి కాల్ చేసి తన సంతోషం పంచుకుంటుంది. మరోవైపు ఆదర్శ్ ముకుంద దగ్గరకు వస్తాడు. కృష్ణకు విషయం తెలుసా అని డాక్టర్ అడుగుతుంది. ముకుంద కృష్ణకు ఇంకా నిజం తెలీదు అని గొడ్రాలిగా ఉండటం కంటే ప్రాణం పోవడమే బెటర్ కదా అంటుంది. ఇంతలో ఆదర్శ్ వచ్చి ఎదురుగా నిల్చోవడం చూసి ముకుంద షాక్ అవుతుంది. ఆదర్శ్ రావడంతో తన ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నానని చెప్తుంది.
ఆదర్శ్ ముకుంద మాటలు నిజమే అని ముకుందని పొగుడుతాడు. నీకు ఏ సమస్యలు లేవా ఏమైనా ఉంటే చెప్పు ముకుంద నేను చూసుకుంటా అని చెప్తాడు. ముకుంద తనకు ఏం కష్టాలు లేవు అని అంటుంది. ఆదర్శ్ ముకుందకు తన ప్రేమను చెప్పకనే చెప్తాడు. దీంతో ఆదర్శ్ మాటలను అర్థం చేసుకున్న ముకుంద తనకి తాను జాగ్రత్తలు చెప్పుకుంటుంది. ఆదర్శ్ గీత దాటకముందే తన పని పూర్తి చేసుకోవాలి అనుకుంటుంది. మరోవైపు భవాని దగ్గరకు రేవతి వస్తుంది. ఆదర్శ్ మీరాల పెళ్లి గురించి అడుగుతుంది. దీంతో భవాని రేవతిని తిడుతుంది. కృష్ణ గురించి టెన్షన్ పడుతుంటే నువ్వు పెళ్లి గురించి అడుగుతావేంటని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.