Naga Panchami Today Episode పంచమిని తీసుకురమ్మని డాక్టర్ చెప్పడంతో వైదేహి డాక్టర్ దగ్గరకు పంచమిని తీసుకెళ్తుంది. ఇక డాక్టర్ పంచమిని అబార్షన్ చేయడానికి తీసుకెళ్తుంది. మరోవైపు మోక్ష హాస్పిటల్ దగ్గరకు పరుగులు తీస్తాడు. మరోవైపు నాగేశ్వరి పాము హాస్పిటల్ దగ్గరకు వస్తుంది.
నాగేశ్వరి: పంచమి ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. తన కడుపులో పెరుగుతున్నది తన కన్న తల్లి అని చెప్పాలి. ఎలా అయినా మహారాణిని కాపాడుకోవాలి.
మళ్లీ పాముగా మారి పంచమిని వెతుకుతుంది. మరోవైపు డాక్టర్ పంచమిని పరీక్షించి అబార్షన్ చేయడానికి రెడీ అవుతుంది. పంచమి మోక్ష మాటల్ని తలచుకొని ఏడుస్తుంది. ఇక డాక్టర్ పంచమికి ఇంజక్షన్ చేస్తుంది. నాగేశ్వరి పాము అక్కడి వస్తుంది. మోక్ష కూడా హాస్పిటల్‌కి చేరుకుంటాడు. పంచమి పంచమి అని కేకలు పెడుతూ పంచమి కోసం వెతుకుతాడు. ఇంతలో ఓ నర్స్ వచ్చి ఎమర్జన్సీ కేస్ అని బిడ్డ అడ్డం తిరిగిందని డాక్టర్‌ని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక నాగేశ్వరి పాము పంచమి దగ్గరకు వస్తుంది.
నాగేశ్వరి: పంచమి..
పంచమి: నాగేశ్వరి ఏమైంది.(నాగేశ్వరి ఫణేంద్రతో గొడవ పడటం వల్ల మెడమీద కాలిపోయి ఉంటుంది.)
నాగేశ్వరి: నా సంగతి పక్కన పెట్టు నువ్వు గర్భం తీయించుకోకూడదు.
పంచమి: మోక్షాబాబు ప్రాణాలకు ముప్పు అని చెప్తున్నారు నాగేశ్వరి.
నాగేశ్వరి: అవన్నీ అబద్ధాలు పంచమి. అంతా కరాళి కుట్ర. అసలు విషయం చెప్తాను విను పంచమి. నీ కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు. నీ కన్న తల్లి విశాలాక్షి. ఇది నిజం పంచమి నా మీద ఒట్టు వేసి చెప్తున్నా.. మీ అమ్మ ఆత్మ నాకు కనిపించి.. అని మొత్తం చెప్తుంది. నీ పరిస్థితి చూసి నేను నీకు రక్షణగా ఉన్నది అందుకే పంచమి. నీ కన్న తల్లిని నువ్వు చంపుకోవద్దు. నువ్వు నీ కళ్లతో నీ కన్నతల్లిని చూడలేదు. నువ్వు కళ్లు తెరిచేలోగా నీ కన్నతల్లి చనిపోయింది. నీ కన్న బిడ్డ రూపంలో నీ కన్నతల్లిని చూసే అదృష్టం నీకు కలుగుతుంది. దాన్ని వదులుకోవద్దు. ఎక్కువ సమయం లేదు. డాక్టర్ వచ్చేలోపు ఇక్కడ నుంచి బయటపడు. నువ్వు నీ బిడ్డని అంటే విశాలాక్షిని కాపాడుకుంటాను అని నా మీద ఒట్టు వేయు పంచమి. ఇక్కడ నుంచి త్వరగా వెళ్లిపో పంచమి. నువ్వు ఎక్కడ ఉన్నా నీ తల్లిని మాత్రం కాపాడు.
డాక్టర్ వచ్చే సరికి పంచమి వెళ్లిపోయి ఉంటుంది. నర్స్ వెతికినా పంచమి కనిపించదు. ఇక డాక్టర్ వచ్చి పంచమి కనిపించడం లేదని వైదేహికి చెప్తుంది. వైదేహి షాక్ అయిపోతుంది. ఇంతలో మోక్ష అక్కడికి వస్తాడు. పంచమి ఎక్కడని అడుగుతాడు. పంచమి కనిపించడం లేదని వైదేహి చెప్తుంది.
వైదేహి: నాకు ఎందుకో భయంగా ఉంది మోక్ష. త్వరగా వెతుకు.
మోక్ష: దీనంతటికి కారణం నువ్వే అమ్మ. లోపల ఎక్కడా లేదమ్మా.. మోక్ష ఇంటికి కాల్ చేసి పంచమి కనిపించడం లేదని చెప్తాడు. అందరూ కంగారు పడతారు. మోక్ష కనిపించిన వాళ్లందరినీ పంచమి గురించి అడుగుతాడు. పంచమి మాటల్ని తలచుకొని మోక్ష ఏడుస్తాడు.
జ్వాల: గర్భం తీయించుకుంటాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన పంచమి అక్కడ అత్తయ్యకు హాండ్ ఇచ్చి ఎస్కేప్ అయింది అంటే.. ఆ పంచమి ఎంత డెకాయిటో ఆలోచించండి మామయ్య.
చిత్ర: పాలు పోసి పెంచినా పాము పామే కదా అక్క.. దాని విషపు బుద్ధులు ఎక్కడికి పోతాయి.
జ్వాల: అవునవును మోక్ష ప్రాణాలు పోవడం కళ్లారా చూస్తే కానీ పంచమి పగ చల్లారేలా లేదు.
శబరి: మీరు నోర్లు మూయండి.
మీనాక్షి: మీ ఒళ్లంతా విషం పెట్టుకొని ఎప్పుడూ పంచమినే అంటారు.
రఘురాం: ఆపండి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో.. ఏంటో అని టెన్షన్ పడుతుంటే మీరు ఏంటి.. మరోవైపు వైదేహి ఇంటికి వస్తుంది.
శబరి: ఒక్క దానివే వస్తున్నావ్ పంచమి కనిపించలేదా..
వైదేహి: అది నన్నే నమ్మించి మోసం చేసింది. చివరి నిమిషంలో డాక్టర్ కళ్లు కప్పి పారిపోయింది.
రఘురాం: అన్నీంటికీ నీ తొందరపాటే కారణం వైదేహి.
వైదేహి: దాన్ని నేను వదిలిపెట్టను. ఎక్కడున్నా పట్టుకొని గర్భం తీయిస్తా. నాకు నా కొడుకు ప్రాణం ముఖ్యం. ఇంతలో మోక్ష అక్కడికి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.