Brahmamudi Today episode: డబ్బులు విషయంలో రాహుల్ సేటుతో  ఒప్పందం కుదుర్చుకుంటాడు. 


ఇంట్లో కావ్య వాళ్ళ మామయ్య గారు నిన్న రాజ్తో చెప్పిన మాటలు గుర్తొచ్చి నిజం ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటుంది..


కావ్య : మావయ్య మీ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని కంగారు పడుతున్నారా.. లేక ఆయనకి ఇంట్లో జరిగిన అవమానాలు గురించి తలుచుకుని బాధపడుతున్నారా..


సుభాష్ : కంగారుపడిన బాధపడిన నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా..


కావ్య : అని తప్పించుకోవాలని చూస్తున్నారా. మీరు అనుకుంటే అన్ని ఆపగలరని నాకు తెలుసు మావయ్య 


సుభాష్ : నేనా 


కావ్య:  మీరు బాబు తీసుకొని వెళ్లడం. మీ అబ్బాయి మీ వెనకే వచ్చి మాట్లాడటం మొత్తం విన్నాను మావయ్య .ఒకవైపు నేను ఆయన్ని ఎలా కాపాడాలని ఆలోచిస్తుంటే మీరు అన్ని చేసి కూడా ఎందుకు మౌనంగా ఉండిపోయారు 


సుభాష్ : మరో దారి లేక 


కావ్య:  నిజమేంటో నాకు చెప్పండి మావయ్య. దానికి దారి నేను చూపిస్తాను. చెప్పలేనమ్మ. చెప్పే విషయమే అయితే రాజ్ ఏ చెప్పేవాడు కదా .


మామ గారి చేత ప్రమాణం చేయించుకుంటుంది కావ్య.


కావ్య:  మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పండి అసలేం జరిగింది. 


సుభాష్ : జరిగినది చెప్పమని ఒట్టు వేయిస్తున్నవ్. చెప్పకూడదని రాజ్ నా దగ్గర ఒట్టు తీసుకున్నాడు. మరి నన్ను ఏ ఒట్టుకు విలువ ఇమ్మంటావు  కావ్య. అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. కన్నతల్లి వాడిని తిడుతున్నా  జరిగిన తప్పుని  ఎలా సరి చేయాలో తెలీక మౌనంగా ఉంటున్నాను.


కావ్య:  అంటే మీ అబ్బాయి ఇంట్లోంచి వెళ్లిపోవాలని మీరు అనుకుంటున్నారా..


సుభాష్ : అది చెప్పాల్సింది నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదమ్మా ... రాజ్.


కావ్య:  మావయ్య ఆయన వెళ్లిపోవాలని చూస్తారు కానీ నిజం చెప్పరు. అప్పుడు కూడా ఇలానే చూస్తూ ఉండిపోతారా..


సుభాష్ : ఆ క్షణం రాకముందే అపర్ణ మనసు మారాలని కోరుకుంటున్నాను. అమ్మ కావ్య. నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా.


కావ్య:  ఏంటి మావయ్య 


సుభాష్ : రాజ్ విషయంలో అందరూ చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు . వాళ్లు, వీళ్లు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు. అసలు నువ్వేం అనుకుంటున్నావ్.


కావ్య:  ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు 


సుభాష్ : ఎందుకంటే నీ స్థానంలో మరొక ఆడది ఉంటే తన భర్త ఒక బిడ్డను తీసుకువచ్చి నాకు మరొక ఆడదానికి పుట్టిన బిడ్డ అని చెబితే ఎవరు ఊరుకోదు. ఈ వాటికి ఆ మొగుడుతో గొడవ పెట్టుకుని అత్తారింటిని రోడ్డు మీదకి లాగేది. కానీ నువ్వలా చేయలేదమ్మా. అందుకే అడుగుతున్నాను. రాజ్ విషయంలో నువ్వేం అనుకుంటున్నావు. 


కావ్య:  ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు మావయ్య. అంత పెద్ద తప్పు చేశానని ఆయనే చెబుతున్న. నా మనసు మాత్రం నమ్మటం లేదు. ఆడవాళ్లలో  అమ్మతనం చూస్తారు. సాయం అడిగిన వాళ్ళలో వారు పడుతున్న కష్టాన్ని చూస్తారు. అలాంటి మనిషి తప్పు చేస్తారా. 


సుభాష్ : చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు రాజ్ మీద పెట్టుకున్న నమ్మకం మమ్ము కాకూడదని ఆ దేవుడిని కోరుకుంటున్నాను...


కావ్య:  మీరు ఇలా మాట్లాడి నిజం దాచినంత మాత్రాన, నేను వదిలేస్తానని అనుకోకండి మావయ్య. నేను ఆ నిజమేంటో తెలుసుకుంటాను.


సుభాష్ : నువ్వు నమ్మిన దానిని నిజమా అనుకొని ముందుకు వెళ్ళు కావ్య. నీ కోరికలో నిజాయితీ ఉంది. నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 


రాజ్ ఇంట్లో ఆలోచిస్తూ ఉంటాడు అక్కడికి కావ్య వచ్చి మీరు బయటికి వెళ్లిపోతే భర్త లేని అత్త వాళ్ళ ఇంట్లో కోడలుగా బతకాలా. మీకే స్థానం లేని ఇంట్లో నాకు స్థానం ఉండదని మా పుట్టింటికి వెళ్ళమంటారా. రాముడు అడవికి వెళ్తుంటే సీతలాగా మీ వెనకాతలే రావాలా.  అన్న వెనకే  లక్ష్మణుడు వెళ్ళిపోతుంటే ఊర్మిళ నిద్రపోయినట్టు నిద్ర పోవాలా అని అడుగుతుంది. మీ అమ్మ గారి మాటకు మీటు తలవంచినప్పుడు నాకు భార్య ఉంది, దాని గతేంటి అని ఆలోకించలేదా అని ప్రశ్నిస్తుంది. 


రాజ్ : నువ్వు అడుగుతున్న చాలా ప్రశ్నలకి జవాబులు అడుగుతున్నావు. నా దగ్గర సమాధానం లేదు. 


కావ్య:  నాకు తెలుసు నా మనస్సాక్షి కూడా తెలుసు మీరే తప్పు చేయలేదని. అందుకే నేను మీతోనే ఉన్నాను. అందరిలా నేను మిమ్మల్ని దోషిగా చూడలేదు. చేయని  తప్పుకు ఎందుకు శిక్ష అనుభవించడానికి సిద్ధమయ్యారు. ఎందుకు అన్నింటికీ తప్పించుకుంటున్నారు. 


రాజ్ :  నేను మంచివాడిని కాదు కాబట్టి , నిజంగానే తప్పు చేశాను కాబట్టి. ఆ తప్పుకు సాక్ష్యంగా ఈ బాబును ఎదురుగా పెట్టుకొని నేను నిర్ధోషిని అని వాదించలేను కాబట్టి.. 


రాగిణి తన కొడుకు రాహుల్ తెచ్చిన కోటి రూపాయలతో ఎదురుగుండా ఉంచుకొని ఆనంద పడుతూ ఉంటుంది. నాకు తెలియకుండానే స్వప్న తన చేసిన సంతకం వల్ల ఇబ్బందులలో  కూరుకుపోయిందని రాహుల్తో అంటుంది. అది పెట్టిన టార్చర్ కి అది చూపించిన ఓవరాక్షన్ కి దాన్ని ఇంట్లో నుంచి టార్చర్ పెట్టేలా చేస్తా. ఇంతలో స్వప్న, వాళ్ల దగ్గరికి వచ్చి  లిప్స్టిక్ పోయిందంటూ  వెతుకుతుంది. రాగిణి,  రాహుల్ కి ఎక్కడ దొరికిపోతామే అని భయపడతారు. కానీ లిప్స్టిక్ దొరకగానే వెళిపోతుంది. 


 కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఆలోచిస్తూ ఉంటే అక్కడికి  పంతులుగారు వచ్చి  దుగ్గిరాల వారి సాంప్రదాయం ప్రకారం  స్వామివారి కల్యాణం జరిపించాలి కదా  అది గుర్తు చేయడానికి వచ్చాను. 


తరువాయి భాగంలో .. 


ఈ సారి సీతారాముల కళ్యాణం.. కావ్య, రాజ్ చేస్తారు అని ఇందిరా దేవి ప్రకటిస్తుంది. మీడియా వారందరి ముందు.. బాబు ఎవరు అని  రాజ్‌ని ఒక మీడియా  రిపోర్టర్ ప్రశ్నిస్తుంది..