Stress Reducing Tips : డోంట్ స్ట్రెస్​ ద స్ట్రెస్ అన్నట్లు ఒత్తిడితో ఉన్నప్పుడు మీరు దానిని తగ్గించుకోవడం కోసం చూడాలి. లేదంటే ఒత్తిడి ఎక్కువై మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుంది. ఇది మీ రోజంతటిని, రోజూవారీ కార్యక్రమాలను డిస్టర్బ్ చేస్తుంది. అంతేకాకుండా శారీరకంగా కూడా మీరు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా ఒత్తిడికి గురైతే.. కేవలం 5 నిమిషాల్లోనే దానిని తగ్గించుకోగలిగే టిప్స్ ఇక్కడున్నాయి. ఈ చిట్కాలు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సాహిస్తాయి. 


నీరు తాగండి..


మీరు ఒత్తిడికి గురైనప్పుడు ఓ గ్లాసు నీటిని తాగండి. ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు మీరు హైడ్రేటెడ్​గా ఉండడం చాలా అవసరం. మీరు డీహైడ్రేట్​ అయిపోతే.. అది మీ ఒత్తిడి స్థాయిలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది అలసట, అధిక ఒత్తిడి ప్రతి స్పందనకు దారితీస్తుంది. తక్కువ నీరు తీసుకునే వ్యక్తులతో పోలిస్తే నీరు రెగ్యూలర్​గా తాగేవరకు ఒత్తిడి, ఆందోళన, నిరాశను పెంచుతుంది. 


బ్రీత్ ఎక్సర్​సైజ్


ఒత్తిడిని తగ్గించడంలో శ్వాస వ్యాయామాలు చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి. మీ శ్వాస మందగిస్తే అది మీలో ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. కాబట్టి మీరు ముక్కు ద్వారా డీప్​ బ్రీత్ తీసుకోండి. కొన్ని సెకన్లు దానిని హోల్డ్ చేసి మీ నోటి ద్వారా నెమ్మదిగా బయటకు వదిలేయండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. తద్వారా మీరు ఒత్తిడినుంచి ఉపశమనం పొందుతారు. 


మ్యూజిక్ వినండి


మీకు నచ్చిన పాటను మీ భావోద్వేగాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పలు అధ్యయనాలు కూడా సంగీతం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిరూపించాయి. కాబట్టి మీరు బాగా స్ట్రెస్​గా ఫీల్ అయినప్పుడు మీరు మంచి సంగీతాన్ని వినవచ్చు. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 


అరోమా థెరపీ..


అరోమా థెరపీ ఒత్తిడిని తగ్గిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్​లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం సువాసన కలిగిన కొవ్వొత్తులు మానసిక ప్రయోజనాలను మీకు అందిస్తాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. కాబట్టి మీరు లావెండర్, యూకలిప్టస్ వంటి ఫ్లేవర్ క్యాండిల్స్ ట్రై చేయవచ్చు. ఇవి మీకు ఒత్తిడిని తగ్గించి.. ప్రశాంతతను అందిస్తాయి. ఇవి మీకు ఓదార్పును అందించి.. రిలాక్స్​గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. 


వాకింగ్.. 


రోజంతా కూర్చొని వర్క్ చేస్తున్నారా? అయితే మీరు ప్రతి గంటకు లేదా రోజుకు 4 నుంచి 5 సార్లు 10 నిమిషాలు నడవండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు నడిస్తే మీ మానసిక స్థితి మెరుగవుతుంది. స్వచ్ఛమైన గాలి, సహజమైన కాంతి, శారీరక కదలికలు మీ భావోద్వేగాలను మెరుగుపరుస్తాయి. మీ మనస్సు క్లియర్ చేయడానికి, పరిసరాలను అర్థం చేసుకోవడానికి వాకింగ్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది. 


బాలాసనం..


చైల్డ్ పోజ్ అనేది ఒత్తిడిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది. ఇది మెడ వెనుక భాగం, భుజాలు, నడుము భాగంలోని ఒత్తిడిని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఆసనం వేసేప్పుడు మీ శ్వాస, శరీరంలోని శారీరక అనుభూతిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. శారీరక, మానసికంగా ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఒత్తిడి ఉన్నప్పుడు.. లేదా రోజూ రాత్రి పడుకునే ముందు మీరు ఈ ఆసనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ నిద్రను కూడా బాగా మెరుగుపరుస్తుంది. 


Also Read : పిల్లలు హెల్తీగా బరువు పెరిగేందుకు రాగులను ఇలా చేసి తినిపించండి