హాలీవుడ్ జంట జెన్నిఫర్ లోపెజ్, అలెక్స్ రోడ్రిగ్జ్ కొన్నేళ్ళ క్రితమే వాళ్ళు పాటించే నో షుగర్ డైట్ గురించి చెప్పి అప్పట్లో వార్తల్లో నిలిచారు. చక్కెర లేకుండా డైట్ ఫాలో అవడం దీని ముఖ్య ఉద్దేశం. పంచదార ఆరోగ్యానికి హానికరం. తియ్యదనం ఇస్తుందనే కానీ దీని వల్ల నష్టాలే కానీ ఎటువంటి లాభాలు ఉండవు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు చక్కెరని విషంగా పరిగణిస్తారు. మధుమేహం, ఊబకాయం, మూత్రపిండాలు, గుండె సమస్యలు మొదలైన అనేక వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఈ చక్కెర.


మనం రోజువారీ తీసుకునే ఆహారం నుంచి చక్కెరని తొలగించడం సాధ్యం కాదు. అందుకే చాలా మంది ఈ నో షుగర్ డైట్ ని ఫాలో అవుతున్నారు. కొన్ని రోజుల పాటు పంచదార అనేది తీసుకోకుండా ఉంటారు. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెప్పిన దాని ప్రకారం రోజువారీ కేలరీలలో 10 శాతం కంటే తక్కువ చక్కెర తీసుకోవడం పరిమితం చేయాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మహిళలు 6 టీ స్పూన్ల కంటే తక్కువ చక్కెర తీసుకుంటే పురుషులు 9 టీ స్పూన్ల పంచదార మాత్రమే తీసుకోవాలి.


పండ్లు, కొన్ని కూరగాయాల్లో సహజంగానే చక్కెర ఉంటుంది. వాటిని పక్కన పెట్టడం కుదరదు. కానీ దనాయికి బదులుగా ఆహారం లేదా పానియాలలో అదనంగా చక్కెర జోడించుకోకుండా ఉండాలి. పంచదార కలుపుకొని ఎటువంటి పదార్థాలు అయినా తీసుకోవచ్చు.


ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి 


⦿కార్న్ షుగర్


⦿బ్రౌన్ షుగర్


⦿ఫ్రక్టోజ్


⦿గ్లూకోజ్


⦿తేనె


⦿సుక్రోజ్


⦿తెల్ల పంచదార


⦿చక్కెర సిరప్


నో షుగర్ డైట్ వల్ల ప్రయోజనాలు


పంచదార తీసుకోకుండా రోజువారీ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి..


మధుమేహం అదుపులో


రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన చక్కెర తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. ఈ చక్కర రక్తప్రవాహంలోకి వెళ్తుంది. దీని వల్ల ప్యాంక్రియాస్ పెద్ద మొత్తంలో ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. ఈయల తరచుగా జరిగితే ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. దాని వల్ల మధుమేహం వస్తుంది.


బరువు తగ్గిస్తుంది


రోజు అధికంగా పంచదార తీసుకోవడం అసలు మంచిది కాదు. ఇది అనారోగ్యకరమైన బరువు పెరగడానికి కారణం అవుతుంది. చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఊబకాయం, బొడ్డు చుట్టూ కొవ్వు చేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి.


గుండె ఆరోగ్యానికి మేలు


చక్కెర గుండె జబ్బులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా కారణం అవుతుంది. ఇందులోని ట్రైగ్లిజరైడ్స్ కొవ్వుని పెంచుతాయి. గుండె పోటు, స్ట్రోక్ వెనుక కారణమైన కొలెస్ట్రాల్ ని ఇది పెంచేస్తుంది. నో షుగర్ డైట్ ఫాలో అవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.


ఒత్తిడి తగ్గిస్తుంది


మెదడు పనితీరు మనం తీసుకునే ఆహారం మీద ఆదాహపడి ఉంటుంది. ఇది మానసిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. చక్కెర ఉన్న ఆహారాలు తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ ఎక్కువగా వస్తాయి. షుగర్ తిన్నప్పుడు మెదడులోని ఎండార్ఫిన్, డోపమైన్ లని విడుదల చేస్తుంది. ఇది ఓటతీ, ఆందోళన కలిగిస్తుంది.


కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది


అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది ప్రాణాంతక పరిస్థితి. కాలేయం ఫ్రక్టోజ్ ని విచ్చిన్నం చేసి కొవ్వుగా మారేలా చేస్తుంది. ఇది కాలేయానికి సమస్యల్ని కలిగిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: కోవిడ్ సోకిన 18 నెలల తర్వాత చనిపోయే ప్రమాదం? భయపెడుతున్న అధ్యయనం!