Fatty Liver Disease Reversal and Treatment : శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. దీనిని సరిగ్గా చూసుకోకుంటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు అన్ని ఇన్ని కాదు. పైగా కాలేయ సమస్యలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. కాబట్టి ముందు నుంచే లివర్​ హెల్త్​ని కాపాడుకోవాలని సూచిస్తుంటారు వైద్యులు. అయితే ఇప్పటికే లివర్ డ్యామేజ్ అయిపోతే.. ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే.. దానిని రివర్స్ చేసుకోవచ్చా? అది సాధ్యమేనా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూసేద్దాం. 

ఫ్యాటీ లివర్ 

కాలేయంలోని కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ డీసిస్ అంటారు. దీనినే హెపాటిక్ స్టీటోసిస్​ అని కూడా పిలుస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసే వారిలో ఈ సమస్య పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం కూడా హెచ్చరిస్తుంది.

ఫ్యాటీ లివర్​లోని రకాలు.. 

ఈ ఫ్యాటీ లివర్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి. ఇది అత్యంత సాధారణ రకంగా చెప్పొచ్చు. దాదాపు 80 నుంచి 90 శాతం కేసులకు ఇదే కారణం. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధఖత, మెటబాలీజం సిండ్రోమ్​ వల్ల ఇది వస్తుంది. మరొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వస్తుంది. 

ఫ్యాటీ లివర్​ని రివర్స్ చేయవచ్చా?

ఫ్యాటీ లివర్​ని రివర్స్ చేయవచ్చా? అనే ప్రశ్నకు కచ్చితంగా ఎస్​ అనే ఆన్సర్ ఇస్తున్నారు నిపుణులు. దీనిని కచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చట. అయితే దీనికోసం జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలని సూచిస్తున్నారు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు బరువు తగ్గడం వల్ల తగ్గుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయాలట. నడక, సైక్లింగ్, స్విమ్ చేయడం వంటివి చేస్తే మంచిది. 

ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, లీన్ ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ మీ డైట్​లో ఉండేలా చూసుకోండి. నట్స్, సీడ్స్​ని కూడా డైట్​లో తీసుకోవచ్చు. ప్రాసెస్ చేయని ఫుడ్స్ తీసుకుంటే మంచిది. స్వీట్స్, కార్బోహైడ్రేట్లతో నిండి ఫుడ్స్​కి, డ్రింక్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి. పూర్తిగా

మానేసినా మంచిదే. 

ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉండే చేపలు, అవిసెగింజలు, చియా సీడ్స్ తీసుకుంటే మంచిది. ఇవి వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. బెర్రీలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేసి హైడ్రేటెడ్​గా ఉండేందుకు మంచి నీటిని పుష్కలంగా తీసుకోవాలి. 

వైద్య సహాయం.. 

ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించుకోవడానికి వైద్య సహాయం కచ్చితంగా తీసుకోవాలి. కడుపు నొప్పి, కామెర్లు, అలసటగా, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కాలేయ సమస్యకు సంకేతాలు. వీటిని గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. కాలేయ సమస్యను ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా చికిత్స తీసుకుంటూ రివర్స్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.