SunRisers New Jersey Fro IPL 2025: స‌న్ రైజ‌ర్స్ కొత్త జెర్సీ విడుద‌ల‌.. తగ్గేదేలే అంటున్న అభిషేక్‌, ఇషాన్.. ఈనెల 23న తొలి మ్యాచ్

ఇన్స్టాగ్రామ్ వేదిక‌గా జెర్సీ ఫొటోల‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో క్ష‌ణాల్లో వైర‌లైంది. కుర్రాళ్లు అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ నూత‌న జెర్సీల‌ను ధ‌రించి, తగ్గేదేలే అన్న‌ట్లుగా ఫోజు పెట్టారు. 

Continues below advertisement

Sunrisers News: ఐపీఎల్ జోష్ మ‌రికొన్ని రోజుల్లోనే మొద‌ల‌వ‌బోతోంది. టోర్నీలోని ఫ్రాంచైజీల సంద‌డి మాములుగా లేదు. హైద‌రాబా్ద కు చెందిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంచైజీ తాజాగా అభిమానుల‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సీజ‌న్ కు గాను తమ జ‌ట్టు స‌భ్యులు ధ‌రించే జెర్సీ ఫొటోల‌ని తాజాగా విడుద‌ల చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా ఇందుకు సంబంధించిన పోస్టును రిలీజ్ చేశారు. ఈ వీడియో క్ష‌ణాల్లో వైర‌లైంది.

Continues below advertisement

కుర్రాళ్లు అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ నూత‌న జెర్సీల‌ను ధ‌రించి, తగ్గేదేలే అన్న‌ట్లుగా ఫోజు పెట్టారు. ఇక ఈ వీడియోపై కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్ల‌తో సోష‌ల్ మీడియాను ఆరెంజ్ ఆర్మీ స‌భ్యులు షేక్ చేస్తున్నారు. దాదాపుగా గ‌తేడాది ధ‌రించిన జెర్సీలానే ఉంది. ఇక‌ గ‌తేడాది ధ‌నాధ‌న్ ఆట‌తీరుతో మైమ‌రిపించిన స‌న్ రైజ‌ర్స్.. ఈ ఏడాది త‌న జ‌ట్టును మ‌రింత ప‌టిష్టం చేసుకుంది. కోర్ టీమ్ లోని చాలామంది ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకున్న స‌న్.. ఈ ఏడాది ఇషాన్, మ‌హ్మ‌ద్ ష‌మీ, హ‌ర్ష‌ల్ ప‌టేల్, ఆడ‌మ్ జంపాలాంటి ప్లేయ‌ర్ల‌ను జ‌ట్టులోకి తీసుకుంది. దీంతో టీమ్ మ‌రింత బ‌లోపేత‌మైన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

రెండో టైటిల్ పై గురి..
గ‌తేడాది ఫ‌టాఫ‌ట్ ఆట‌తీరుతో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టారు స‌న్ బ్యాట‌ర్లు. ముఖ్యంగా ఆరంభంలోనే ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌.. ప్ర‌తి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాల‌ని ఆడుతూ, ముచ్చెట‌మ‌లు ప‌ట్టించారు. హెన్రీచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి కూడా ధ‌నాధ‌న్ ఆట‌తీరుతో ఎంతో మంది బౌల‌ర్ల‌కు నిద్ర లేని రాత్రుళ్ల‌ను మిగిల్చాడు. ఈ ఏడాది ఇషాన్, అభిన‌వ్ మ‌నోహ‌ర్ లాంటి హిట్ట‌ర్ల‌తో బ‌లం మ‌రింత పెరిగింది. ఇక బౌలింగ్ లో ష‌మీ, హ‌ర్ష‌ల్, జంపా, కెప్టెన్ పాట్ కమిన్స్ రాక‌తో మ‌రింత స్ట్రాంగ్ గా మారింది. ఈనెల 23ను హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ మైదానం వేదిక‌గా త‌మ తొలి మ్యాచ్ ను ఆడ‌నుంది. మ‌.3.30 గంట‌ల‌కు మాజీ చాంపియ‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో త‌ల‌ప‌డ‌నుంది. 2016 టైటిల్ గెలిచిన్ స‌న్.. 2018, 2024లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. దీంతో ఈసారి మ‌రో టైటిల్ నెగ్గాల‌ని భావిస్తోంది. 

 IPL 2025లో..SRH  పూర్తి షెడ్యూల్.. 

మార్చి 23: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్తాన్ రాయల్స్, హైదరాబాద్, 3:30 PM

మార్చి 27: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్, 7:30 PM

మార్చి 30: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్, విశాఖపట్నం, 3:30 PM

ఏప్రిల్ 3: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్ కతా నైట్ రైడర్స్, కోల్ కతా, 7:30 PM

ఏప్రిల్ 6: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్, 7:30 PM

ఏప్రిల్ 12: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్, 7:30 PM

ఏప్రిల్ 17: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, ముంబై, 7:30 PM

ఏప్రిల్ 23: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్, 7:30 PM

ఏప్రిల్ 25: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై, 7:30 PM

మే 2: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్, 7:30 PM

మే 5: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్, 7:30 PM

మే 10: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్ కతా నైట్ రైడర్స్, హైదరాబాద్, 7:30 PM

మే 13: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, బెంగళూరు, 7:30 PM

మే 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో, 7:30 PM

Continues below advertisement