Just In





DC New Catptain: కెప్టెన్ వేటలో ఢిల్లీ.. టీమిండియాలోని ఇద్దరిపై ఫోకస్.. మెగాటోర్నీలో కీలక పాత్ర పోషించిన ఆ ఇద్దరు
గతేడాది జట్టు నుంచి మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ వెళ్లిపోవడంతో కెప్టెన్సీ లోటు ఏర్పడింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు మెగాటోర్నీ ముగిసేవరకు వేచి చూసిన టీమ్ త్వరలోనే సారథిని ప్రకటించనుoది.

DC New Captain Race: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన ఇద్దరు ఇండియన్ ప్లేయర్లలో ఒకరిని, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెలలోనే ముగిసిన ఈ మెగాటోర్నీలో భారత్ మూడోసారి ఈ కప్పును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఢిల్లీ బృందంలో ఉన్న కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పేర్లు కెప్టెన్సీ చర్చలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్.. సీనియర్ వికెట్ కీపర్, టాపార్డర్ బ్యాటర్ కాగా, స్టార్ ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ గుర్తింపు పొందాడు. గత కొంతకాలంగా ఢిల్లీ జట్టులో ప్రధాన సభ్యునిగా అక్షర్ ఎదిగాడు. గతేడాది జట్టు నుంచి మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ వెళ్లిపోవడంతో కెప్టెన్సీ లోటు ఏర్పడింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు ఢిల్లీ యాజమాన్యం చూస్తోంది. మెగాటోర్నీ ముగిసేవరకు వేచి చూసిన టీమ్ యాజమాన్యం.. త్వరలోనే సారథిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మెగాటోర్నీలో ఇద్దరికి అపార అనుభవం ఉండటం ప్లస్ పాయింట్.
అక్షర్ కే చాన్స్ ఎక్కువ..
క్యాపిటల్స్ తరపున ఈ ఏడాది ఏడో సీజన్ ను అక్షర్ ఆడుతున్నాడు. ఓవరాల్ గా 31 ఏళ్ల అక్షర్ కు ఐపీఎల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు తను 150 ఐపీఎల్ గేమ్స్ ఆడాడు. 131 స్ట్రైక్ రేట్ తో 1653 పరుగులు సాధించాడు. అలాగే 7.28 ఎకానమీ రేటుతో 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీకి ఆది నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటంతోపాటు సీనియర్ ప్లేయుర్ కావడం, టీమిండియా వైస్ కెప్టెన్ గా కూడా అనుభవం ఉండటంతో అతని వైపే ఢిల్లీ యాజమాన్యం మొగ్గు చూపే అవకాశముంది. ఇటీవల లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్లో రాహుల్ కంటే కూడా అక్షరే ముందు వస్తుండటంతో అతనికే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
సొంత ఆటతీరుపై ఫోకస్..
ఇక రాహుల్ బ్యాటర్ గా అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, అతనికి ఎక్కువ పర్సనల్ మైల్ స్టోన్స్ పై దృష్టి పెట్టి ఆడతాడనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనర్ గా పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడటంపై కూడా అసంతృప్తి ఉంది. ఇక బ్యాటర్ గా కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. 2018-2024 వరకు ఏడు సీజన్లలో ఆరుసార్లు 500 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగుసార్లు 600+ పరుగులు సాధించిన చరిత్ర ఉంది. 2023లో గాయం కారణంగా మాత్రమే 250+ పరుగులు మాత్రమే సాధించాడు. అయితే జట్టు కన్నా ఆరెంజ్ క్యాప్ సాధించడం కోసమే ఆడతాడనే అపవాదు రాహుల్ పై ఉంది. ఇక తనకు కెప్టెన్సీ అనుభవం కూడా బాగానే ఉంది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కు నాయకత్వం వహించాడు. రెండు సీజన్లలో లక్నోను ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రాహుల్ వైపే మొగ్గు చూపించే అవకాశముంది. జట్టు ఐపీఎల్ సన్నాహకాలు ప్రారంభమవుతున్నాయి. ఈనెల 17 నుంచి ఆటగాళ్లు టీమ్ తో కలవడం ప్రారంభమవుతుంది. ఆలోగా కెప్టెన్సీ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ ప్రకటించే అవకాశముంది. అయితే ఈ టీమ్ స్క్వాడ్ రిత్యా విదేశీ ఆటగాళ్లను కెప్టెన్లుగా తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.