Seethe Ramudi Katnam Serial Today Episode సీత తనని ఇంటికి తీసుకురావడానికి కారణం ఏంటి అని ఇంట్లో వాళ్లని ప్రశ్నిస్తుంది. జనార్థన్ సీతతో ముఖర్జీ గారు నిన్ను ఓ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్స్ చేశారు అందుకే  నిన్ను ఆఫీస్‌కి తీసుకెళ్లడానికి ఇంటికి తీసుకొచ్చామని అంటాడు. వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ గురించి రామ్ చెప్తాడు. 


సీత: అంటే ముఖర్జీ గారు చెప్పారు కాబట్టి మీకు వెయ్యి కోట్లు పోకూడదు కాబట్టి నన్ను తీసుకొచ్చారన్నమాట. 
చలపతి: అంతే సీతమ్మ. వీళ్లు డబ్బు కోసం తప్ప ఇంకేం ఆలోచించరు.
మహాలక్ష్మీ: నిన్ను ప్రాజెక్ట్ కోసమే తీసుకొచ్చాం  సీత. అయితే ఇప్పుడేంటి ఇంట్లో ఉండవా. ఆఫీస్‌కి రావా. 
అర్చన: మనకి లాభం అంటే ఎందుకు తను వస్తుంది మహా. మనల్ని నష్టాల్లో తోయడమే సీత పని.
గౌతమ్: ఇప్పుడు మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయి ముఖర్జీ గారి ముందు మీ పరువు తీస్తుందేమో పిన్ని.
జనార్థన్: నిన్ను పిలిపించింది కేవలం మన లాభం కోసమే కాదు ఓ వంద ఫ్యామిలీలు బాగుపడతాయి.
సీత: నేను ఎక్కడికీ వెళ్లను నేను ఇక్కడే ఉంటాను. ఆఫీస్‌కి వస్తాను. మీరు నన్ను వదిలేసినా నేను మిమల్ని వదులుకోను. మీరు నా మనుషులు కంపెనీ మనది. ఏం చేయడానికి అయినా నేను రెడీ.
రామ్: థ్యాంక్స్ సీత. ఇక్కడ జరిగింది ఏం ఆయనకు చెప్పకు.
సీత: నేను ఇంటి గుట్టుని బయట పెట్టనులే మామ మీకేం టెన్షన్ లేదు.
చలపతి: సీతమ్మ వీళ్లు నిన్ను అవసరం కోసం తీసుకొచ్చారు రేపు పని అయిపోతే పంపేస్తారు.
సీత: వీళ్లు పంపినా నేను వెళ్లను బాబాయ్. నేను వచ్చింది సుమతి అత్తమ్మ చావు వెనక నిజాలు బయట పెట్టడానికి. నేను మహాలక్ష్మీ అత్తయ్యని చంపాలనుకున్నానని సుమతి అత్తమ్మని చంపానని నా చుట్టూ ఓ పద్మవ్యూహం అల్లారు. అన్నీ తేల్చి మచ్చలేని సీతలా మామకి సొంతం అవుతా.


సీతకి సుమతి హత్య విషయంలో తన మీద అనుమానంగా ఉందని సీతకి తాను దొరికిపోయే ప్రమాదం ఉందని సీతని ఈరోజు రాత్రికే చంపేయాలని గౌతమ్ అనుకుంటాడు. సీత చావుకి ఇంట్లో ఎవరో ఒకరిని కారణంగా ఇరికించేస్తానని అనుకుంటాడు. సీత కిచెన్‌లో వంట చేస్తుంటే మహాలక్ష్మీ, గౌతమ్, అర్చన హాల్లో ఉంటారు. అర్చన పేపర్‌లో అత్తని చంపిన కోడలు అని న్యూస్ చదువుతుంది. సీత వచ్చి కోడలు ఎలా చంపింది అత్తని ఉరి వేసిందా.. పొడిచేసిందా.. అని అడిగితే మహాలక్ష్మీ నీకు ఎందుకు పని చూసుకో అని అంటే అత్త నా మీద నోరు పెంచితే ఇంటి నుంచి వెళ్లిపోతా అని డ్రామా మొదలు పెడుతుంది. దాంతో మహాలక్ష్మీ సీతని కూల్ చేస్తుంది. సీత చాకు తీసుకొచ్చి ముగ్గురిని చంపేస్తా అనేంతలా బిల్డప్ ఇచ్చి ఆపిల్ మీదకు విసురుతుంది. తర్వాత ఆపిల్ ముక్కలు చేసి  ముగ్గురికీ పంచుతుంది. మహాలక్ష్మీ గౌతమ్‌తో సీతకి అనుమానం మొదలైంది నువ్వు జాగ్రత్త అని చెప్తుంది. 


రామ్ వర్క్ చేస్తుంటే సీత పాలు తీసుకొని వెళ్తుంది. నువ్వెందుకు వచ్చావ్ సీత అని కంగారు పడతాడు. సీత రామ్‌తో కంగారు పడకు మామ నేను గదిలో పడుకోవడానికి రాలేదు నీకు రాత్రి పాలు తాగి పడుకునే అలవాటు ఉంది కదా అందుకే తీసుకొచ్చా అని అంటుంది. నీ మీద నాకు ఉన్న ప్రేమ అవసరాలకు అమ్ముడు పోదు అని ఎప్పటికీ ఒకేలా ఉంటుందని చెప్తుంది. నీకు నా మీద పూర్తి ప్రేమ లేదు కదా సగం ప్రేమ, సగం నమ్మకం, సగం ఇష్టం అన్నీ సగాలే అంటుంది. తిట్టాలి అనుకుంటే డైరెక్ట్ తిట్టు సీత అని రామ్ అంటే అలా ఏం లేదని అంటుంది. రామ్ నీకు ఇష్టమైతే ఇక్కడ పడుకో సీత అంటే నీ సగం బెడ్ నాకు వద్దు మామ చెరి సగం అవ్వాల్సిన జీవితం సగం సగం అయిపోతుందని తన మాటలతోనే రామ్‌ని సీత హర్ట్ చేస్తుంది. గౌతమ్ మరోసారి పుష్ప జాతర సీన్ గెటప్ వేసి సీత చావు ఈ రాత్రికి నా చేతిలో ఉందని అచ్చం సుమతిని చంపినట్లు రెడీ అయి ఇంటికి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   


Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!