Nuvvunte Naa Jathaga Serial Today March 12th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: పిక్చర్ అబీ బాకీహై మిస్టర్ మొగుడ్.. అమ్మంటే అదీ.. రౌడీని మార్చేసిన శారద!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా పురుషోత్తం దగ్గరకు వెళ్తుంటే మిధున ఆపి ఇక నుంచి పురుషోత్తం దగ్గరకు వెళ్లకూడదని దేవాకి ఆర్డర్ వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున అత్త దగ్గరకు వెళ్లి ఈరోజు నుంచి మిమల్ని అమ్మా అని పిలుస్తా అత్తయ్యా.. మిమల్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మిమల్ని అమ్మా అని పిలవొచ్చా అని అడుగుతుంది. దానికి శారద ఏ అమ్మా నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా.. ఇప్పటికే నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చానని మా ఆయన నా మీద చాలా కోపంతో ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ ఈ పలకరింపులు బంధాలు చూశారు అంటే నా పని అయిపోతుందని అంటుంది. ఈ సీన్ అంతా చూసిన కాంతం ప్రమోదినితో మేడం మిధునకు బాగా తిక్కకుదిరిందని అంటుంది.
దేవా ఇంటికి వస్తూ గుమ్మం తన్నేస్తాడు. కాలికి దెబ్బ తగులుతుంది. శారద వెళ్లబోతే మిధున కూడా అంతే కంగారుగా ఏవండీ అనుకుంటూ వెళ్లి కాలికి దెబ్బ తగిలిందా అని అడిగి గాయం చూస్తుంది. దేవా మిధునకి కాలు చూపించడు. దెబ్బ తగిలితే తగులుతుంది నొప్పి వస్తే వస్తుంది. ఏమైనా కానీ నేను చూసుకుంటా కానీ నువ్వు సెంటిమెంట్ డైలాగులు ప్లే చేయకు అంటాడు. దెబ్బ తగిలిందని నేను బాధ పడితే ఇలా మాట్లాడుతారేంటి అని దేవాని మిధున ప్రశ్నిస్తుంది. మిధునని దేవా నెట్టేసి వెళ్లిపోతాడు. మిధున కంగారుగా కిచెన్‌కి పరుగులు తీసి కట్ట కట్టడానికి పసుపు తీస్తుంది. అది చూసిన శారద తను తన కొడుకు గురించి ఓ తల్లిలా ఎంత ఆరాట పడతాను తను కూడా అంతే ఆరాట పడుతుందని.. బలవంతంగా తాళి కట్టినా దాన్నే జీవితం అనుకుందని గుడిలో అమ్మవారు చెప్పినట్లు దేవాని మార్చబోయే అమ్మాయి ఈమెనా అని అనుకుంటుంది శారద. మరోవైపు భానుని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన సాంబని దేవా కొట్టడంతో సాంబ రగిలిపోతాడు. తనని కొట్టి అవమానించిన దేవాని దెబ్బ తీయాలి అనుకుంటాడు. అందుకు దేవాకి ప్రాణమైన అమ్మానాన్నల్ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు.
మిధున దేవాని కూర్చొపెట్టి దేవా కాలిని తన ఒడిలోకి తీసుకొని గాయానికి పసుపు రాస్తాను అంటే దానికి దేవా కొత్త స్కీమా ఇలా నువ్వు నా గాయానికి పసుపు రాస్తే మిధున గ్రేట్ అనుకొని నా మనసు కరిగిపోయి నా మనసులో చోటు ఇస్తాను అనుకుంటున్నావా ఇలాంటి పసుపు స్కీమ్‌లు నా దగ్గర వద్దని అంటాడు. నువ్వు తాళి కట్టినప్పుడే నీ జీవితంలో నాకు భార్య స్థానం వచ్చేసిందని దాని కోసం ప్రత్యేకంగా నేనేం చేయక్కర్లేదని మిధున అంటుంది. భార్య అనే హక్కుని నీ చొక్కా పట్టుకొని అవసరం అయితే నీ చెంప పగల గొట్టి అయినా తీసుకుంటానని అంటుంది. పెద్ద పెద్ద కత్తిపోట్లు నన్ను ఏం చేయలేదు ఇలాంటి చిన్న దెబ్బలు ఏం చేయవు అని తానో పులి అని ఈ దెబ్బలు తనకు నొప్పి పుట్టించవని అంటాడు. దాంతో మిధున గాయం మీద నొప్పి పుట్టించే మందు చల్లుతుంది. టించర్ చల్లగానే దేవా కెవ్వుమంటాడు. మిధునని తిట్టగానే మళ్లీ మిధున దేవా కాళ్ల మీద పోస్తుంది దాంతో మళ్లీ దేవా అరుస్తాడు. ఇక దేవా కాలికి కట్టు కడుతుంది. నా మీద నువ్వు రివేంజ్ ప్లాన్ చేస్తున్నావ్ కదా అని దేవా అంటే అమ్మవారికి చీర చూపించడానికి వచ్చిన నా మెడలో తాళి కడితే ఊరుకుంటానా అంటుంది. దీంతో వేగేది ఎలారా దేవుడా అని దేవా అంటే పిక్చర్ అబీ భాకీహై మిస్టర్ మొగుడ్ అని అంటుంది. దేవా బిత్తరపోతాడు.
దేవా తల్లిదండ్రులు హాస్పిటల్ నుంచి వస్తుంటే సాంబ తన రౌడీలతో ఫాలో అయి వాళ్లని చంపమని ఒకడిని పంపిస్తారు. ఆ రౌడీ శారదని పొడిచే టైంకి కారు రావడంతో శారద రౌడీని పక్కకు తప్పించి కాపాడుతుంది. రౌడీ చేతికి గాయం కావడంతో పక్కన కూర్చొపెట్టి సపర్యలు చేస్తారు. తల్లిలా జాగ్రత్తలు చెప్పి దగ్గరుండి చూసుకోవడంతో రౌడీలో కన్నీరు పెట్టుకుంటాడు. ఇక దేవాకి పురుషోత్తం కాల్ చేసి త్వరగా రమ్మని అంటాడు. దేవా వెళ్లడం ఇష్టం లేక మిధున షర్ట్ దాచేస్తుంది. మిధునతో గొడవ పడి దేవా షర్ట్ తీసుకున్న తర్వాత ఫోన్ దాచేస్తుంది. ఫోన్ గురించి మిధుననే అడిగితే ఎక్కడుందో చూసుకో అని తన చీరల్నీ దేవా మీద కప్పేస్తుంది. ఇక దేవా ఫోన్ కూడా చూసేస్తాడు. దేవా బయటకు వెళ్తుంటే మిధున ఆపి ఈ రోజు నుంచి నువ్వు పురుషోత్తం దగ్గరకు వెళ్లడానికి నేను ఒప్పుకోను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!