'స్టార్ మా' (Star Maa)లో ప్రారంభమైన కొత్త సీరియల్ 'భానుమతి' (Bhanumathi Serial). ఇందులో ఓ పాత్ర చేస్తున్న తెలుగు అమ్మాయి ఐశ్వర్య. సెకండ్ లీడ్... విలన్ రోల్ భువనగా కనిపించనుంది. అసలు ఈ అమ్మాయి నేపథ్యం ఏమిటి? ఇంతకు ముందు నటించిన అనుభవం ఉందా? అనేది చూస్తే...

గోపీచంద్ 'సిటీ మార్'లో క్రీడాకారిణిగామ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా‌ జంటగా నటించిన స్పోర్ట్స్ బ్యాక్ ‌ డ్రాప్ ఫిల్మ్ 'సిటీ మార్' గుర్తు ఉందా? ఆ సినిమాలో ఐశ్వర్య నటించింది. కబడ్డీ ఆడే అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా! వారిలో ఐశ్వర్య ఒకరు. 

సినిమా కోసం కెమెరా ముందుకు ఐశ్వర్య రావడం 'సిటీ మార్'తో మొదలు అని చెప్పాలి. అయితే ఆ తర్వాత ఆవిడకు అవకాశాలు ఏమీ గొప్పగా రాలేదు.‌‌ 'సిటీ మార్' తర్వాత హీరోయిన్ రోల్ చేసే అవకాశం ఐశ్వర్యకు వచ్చింది. 'కాదల్ కహాని' పేరుతో వచ్చిన ఒక చిన్న సినిమాలో ఆమె హీరోయిన్. ఆ సినిమాలో పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.‌ అయితే సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దాంతో ఐశ్వర్య ప్రయత్నాలు మళ్ళీ మొదటికి వచ్చాయి. 

మిస్ బెజవాడగా ఐశ్వర్య...‌‌ షార్ట్ ఫిలిం గురూఐశ్వర్య నటించిన యూట్యూబ్ ఫిలిమ్స్ లో 'మిస్ బెజవాడ మిస్టర్ భీమవరం' చాలా పాపులర్ అని చెప్పాలి. అదొక యూట్యూబ్ సిరీస్. అలాగే 'వన్ మిలియన్ పిల్ల' అనే మరొక షార్ట్ ఫిలిం చేశారు ఐశ్వర్య. ఆవిడ టీనేజ్ వయసులో షార్ట్ ఫిలిమ్స్ సినిమాలు చేశారు ఇప్పుడు సీరియల్ చేయడం మొదలుపెట్టారు. 

మోడలింగ్ రంగంలో ఐశ్వర్య మొదటి అడుగుఐశ్వర్య మోడలింగ్ రంగంలో మొదట అడుగు వేసింది. రాంప్ వాక్ వంటివి చేసింది.‌ 'శుభం గ్రాండ్' పేరుతో ఏపీలోని కొన్ని నగరాలలో క్లాతింగ్ షో రూమ్స్ ఉన్నాయి. ఆ సంస్థకు యాడ్స్ చేసింది ఐశ్వర్య. ఒకవైపు మోడల్ కింద అడుగులు వేస్తూ మరొక వైపు సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించింది. షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.

భానుమతి... ఐశ్వర్య ప్రయాణంలో కొత్త దారినటిగా ఐశ్వర్య ప్రయాణంలో 'భానుమతి' సీరియల్ కొత్త దారి అని చెప్పాలి.‌ ఈ సీరియల్ ఇటీవల ప్రారంభమైంది కనుక కొన్ని రోజుల పాటు 'స్టార్ మా'లో కంటిన్యూ అవుతుంది. ఇటువంటి సీరియల్స్ చేస్తే తెలుగు టీవీ ప్రేక్షకులకు దగ్గర కావచ్చు. విలన్ రోల్ కనుక‌ ఐశ్వర్య కు నటిగా తనలోని కొత్త కోణం చూపించే అవకాశం దక్కుతుంది.

Also Read: 'జబర్దస్త్' పవిత్రకు సీరియల్ ఆఫర్... మాజీ లవ్ బర్డ్స్ లేటెస్ట్ 'స్టార్ మా' సీరియల్‌లో

'స్టార్ మా' సీరియల్స్ చేసే నటీనటులతో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కార్యక్రమం కూడా జరుగుతుంది. దాని ద్వారా మరింత మందికి చేరువ అవ్వచ్చు. సీరియల్ చేయడం వల్ల ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్ కావచ్చు. అదే సమయంలో సినిమాలతో పాటు ఇతర సీరియళ్లలో కూడా అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు.