సన్నగా ఉంటే ఎలాంటి వ్యాధులు రావడని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా ప్రాణాంతకమైన రోగాలు అసలు రావని అనుకుంటారు. అది కేవలం అపోహ. కొన్ని రకాల వ్యాధులు సన్నంగా ఉండడం, లావుగా ఉండడం అనే తేడా లేకుండా దాడి చేయవచ్చు. అలాంటి వ్యాధుల్లో ఒకటి ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’. దీన్నే కొవ్వు కాలేయ వ్యాధి అంటారు. ఎక్కువగా అయితే ఊబకాయంతో బాధపడేవారిలో ఇది కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల కారణాల వల్ల సన్నగా ఉన్న వారికి కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. 


ఆల్కహాల్ వినియోగం
మద్యం సేవించే అలవాటు ఉన్నవాళ్లు బక్కగా ఉన్నా కూడా వారికి ఫ్యాటీ లివర్ డిసీస్ బారిన పడే అవకాశం ఉంది. మద్యంలో ఉండే క్యాలరీలు జీరో. అందుకే మద్యం కాలేయంలో చేరుకున్నాక కొవ్వుగా మారిపోతుంది.  అలా కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం తాగడం మానేయాలి. ఊబకాయంతో ఉన్న వారు అయితే పూర్తిగా మద్యాన్ని దూరం పెట్టాలి. 


కండలు లేకపోవడం
కొందరు సన్నగా ఉంటారు. కండలు ఉండవు. ఎంతోకొంత కండర ద్రవ్యరాశి ఉండడం చాలా ముఖ్యం. ఎండిపోయినట్టు, పీక్కుపోయినట్టు చేతులు, కాళ్లు ఉండకూడదు. కండరాలు పుష్టిగా లేకపోవడం వల్ల కాలేయం కొవ్వులో పేరుకుపోతుంది. సన్నగా ఉన్నవారికి కండలు తక్కువగా ఉంటాయి. శరీరం పుష్టిగా ఉండడం చాలా ముఖ్యం. 


వారసత్వంగా...
ఈ వ్యాధి కుటుంబ వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధి ఒక వయసుకు వచ్చాక బయటపడుతుంది. ఊబకాయం కూడా వారసత్వంగా వస్తుంది. ఈ రెండూ కలిసి వచ్చే అవకాశం ఉంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి, దానికి ఊబకాయం తోడైలే పరిస్థితి అధ్వానంగా ఉంటుంది.  


జీవక్రియ రుగ్మత
ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటివి రావడానికి  కొన్ని రకాల జీవక్రియ సమస్యలు కూడా కారణమే. విల్సన్స్ వ్యాధి  పిలిచే జీవక్రియ రుగ్మత వల్ల ఫ్యాక్టరీ లివర్ డిసీస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి కాలేయ వ్యాధులు మాకు వచ్చే అవకాశం లేదని సన్నగా ఉండే వారు అనుకునే వీల్లేదు. 


కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కాపాడుకోకపోతే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. అందుకే కాలేయానికి మేలు చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. కాలేయం కోసం వెల్లుల్లి, ఓట్స్ తో వండిన ఆహారం, చేపలు, కాఫీ, గ్రీన్ టీ, ద్రాక్ష, ఆలివ్ ఆయిల్, బెర్రీ పండ్లు, గుడ్లు, నట్స్ వంటివి తినాలి.



Also read: నా భార్య రోజంతా టీవీ చూస్తూ నా చేతే పనులు చేయిస్తోంది, నాకేమో చెప్పే ధైర్యం లేదు






































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.