వేసవి కాలంలో పండ్ల రసాలతో పాటూ ఫలూదాను అధికంగా తాగుతారు. హైదరాబాద్‌లో బాగా పాపులర్ అయిన డ్రింక్ ఇది. దీనికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. మండే ఎండల్లో దీన్ని తాగడం వల్ల శరీరం కూల్ అవుతుంది. ఇందులో వాడేవి పాలు, సబ్జాగింజలు, సేమ్యా వంటివి కనుక ఆరోగ్యానికి కూడా ఢోకా లేదు. మధుమేహం ఉన్న వారు మాత్రం దీనికి దూరంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే దీని తయారీలో పంచదార, ఐస్ క్రీమ్ ను వాడుతాం కనుక, వారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వారు అధికంగా తాగకపోవడమే మంచిది.  పిల్లలు మాత్రం ఫలూదాను బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఐస్ క్రీములా స్పూనుతో తినవచ్చు. వారికి మంచి టేస్టీ టైమ్ పాస్ ఇది.


కావాల్సిన పదార్థాలు
స్ట్రాబెర్రీ జామ్ - అరకప్పు
రోజ్ సిరప్ - మూడు టేబుల్ స్పూన్లు
పాలు - రెండు కప్పులు
సబ్జా గింజలు - పావు కప్పు
చక్కెర - మూడు స్పూన్లు
ఉడికించిన సేమ్యా - నాలుగు స్పూన్లు
వెనిల్లా ఐస్ క్రీమ్ - అయిదు స్పూన్లు
బాదం పప్పు తురుము - రెండు స్పూన్లు
పిస్తా తురుము - ఒక స్పూను


తయారీ ఇలా
1. పాలను బాగా మరిగించాలి. సిమ్‌లో పెట్టి రెండు కప్పుల పాలు ఒకటిన్నర కప్పు అయ్యే దాకా మరిగించాలి. 
2. ఆ పాలు చల్లారాక పంచదార, రోజ్ సిరప్ వేసి బాగా గిలక్కొట్టాలి. గిలక్కొట్టాక ఫ్రిజ్ లో పెట్టాలి.
3. సబ్జా గింజలు  రాత్రే నానబెట్టుకోవాలి. 
4. సేమ్యాను ఉడకబెట్టి నీళ్లు ఓర్చి పక్కన పెట్టుకోవాలి. 
5. ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకుని రోజ్ సిరప్ కాస్త వేయాలి. దానిపై స్ట్రాబెర్రీ జామ్ కూడా వేయాలి. 
6. ఉడికించిన సేమ్యాను, నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసుల్లో వేయాలి. 
7. ఫ్రిజ్‌లో పెట్టిన పాల మిశ్రమాన్ని గ్లాసుల్లో వేయాలి. 
8. ఆ పాల మిశ్రమంపై ఐస్‌క్రీమ్ స్కూప్‌లు వేయాలి. ఐస్‌క్రీముపై బాదం, పిస్తా తురుమును  ఐస్‌క్రీముపై చల్లాలి. అంతే ఫలూదా రెడీ అయినట్టే. దీన్ని డీప్ ఫ్రిజ్లో రెండు గంటలు ఉంచితే చాలా కూల్‌గా అవుతుంది. తింటే టేస్టీగా అవుతుంది.  


Also read: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే



Also read: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది


Also read: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది