ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జోరు మీదున్నాయి. నేరుగా మీడియా ముందుకు వచ్చి చేసుకునే విమర్శలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తి పోసుకోవడం ఇప్పుడు కామన్‌గా మారింది. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మధ్య ఈ ట్విట్టర్ యుద్ధం నెక్ట్స్ లెవల్‌కు చేరుకుంది. కుటుంబసభ్యులను సైతం చొప్పించి రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటూడటంతో ఈ వ్యవహారం రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతోంది. మొదట టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంబటి రాంబాబు ఓ యూట్యూబ్ చానల్ మహిళా జర్నలిస్టును వేధించారని పోస్ట్ పెట్టారు.
దీనికి కౌంటర్‌గా అంబటి రాంబాబు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు.
అక్కడ్నుంచి ఇద్దరి మధ్య ట్వీట్ వార్ మరో రేంజ్‌కు చేరుకుంది. తనకు సంస్కారం ఉందంటూ ఓ ఫేస్ కనిపించని ఫోటోను అయ్యన్న ట్వీట్ చేశారు.
ఆ తర్వాత అంబటి రాంబాబు మరింత అభ్యంతరకంగా పోస్టులు పెట్డడంతో అయ్యన్నపాత్రుడు... అంబటి రాంబాబు మాట్లాడినట్లుగా చెబుతున్ ఓ ఆడియోను ట్వీట్ చేశారు.
వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ ఇంకా కొనసాగుతోంది. అంబటి రాంబాబు రాసలీలలన్నీ సీఎం జగన్ దగ్గరకు చేరాయని.. చర్యలు తీసుకుంటారో లేదో వారిష్టమని అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు.
పార్టీ నేతలు, వారి అధినేతలు కుటుంబసభ్యుల వ్యక్తిత్వాలను సైతం కించ పరిచేలా ఇలా పోస్టులు చేసుకోవడంతో రెండు పార్టీల్లోనూ ఈ అంశం చర్చనీయాంశం అయింది.