Man Removed His Ears | ఇక మాస్క్‌తో పనిలేదని ప్రభుత్వం చెబితే మనం ఏం చేస్తాం? కేవలం మాస్క్ మాత్రమే తొలగిస్తాం. కానీ, ఇతడు మాత్రం ఏకంగా తన చేవులనే కత్తిరించేసుకున్నాడు. ‘‘అరే, ఏంట్రా ఇదీ’’ అని అడిగితే ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పాడు. చెవులను కత్తిరించుకోడానికి ఇతడికి అంత సరదా ఏమిటనేగా మీ సందేహం. పదండి, అతడి గురించి తెలుసుకుందాం. 


ఆ ఫొటోలో చూసినప్పుడు మీకు సగం అర్థమైపోయి ఉంటుంది, ఇతడేదో తేడా ఉన్నాడని. ఫారో డో ప్రాడో అనే బ్రెజిలియన్ వ్యక్తికి మనిషిలా బతకడం ఇష్టం లేదు. తనని తాను ఓ సైతాన్‌గా భావిస్తాడు. అందుకే అంతా అతడిని ‘మానవ సైతాన్’ అని అంటారు. అతడు తన రూపాన్ని మార్చుకోవడం కోసం తన ముఖంలో 60కు పైగా సర్జరీలు వేయించుకున్నాడు. అతడి శరీరంలో 85 శాతం సిరా(టాటూ)తో కప్పబడి ఉంది. గత కొన్నేళ్లుగా అతడు ఎన్నో పచ్చబొట్లు, కుట్లు వేయించుకున్నాడు. చివరికి తన పళ్లను కూడా దెయ్యం దంతాలుగా మార్చుకున్నాడు. 


Also Read: అలా ఎలా? మలద్వారంలోకి చొచ్చుకెళ్లిన 2 కేజీల డంబెల్, ఇదేం పాడు అలవాటు భయ్యా!


అయితే, అతడు అంతటితో ఆగలేదు. నుదిటికి కొమ్ములు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత ముక్కు, ఉంగరపు వేలును పూర్తిగా తొలగించుకున్నాడు. వెండి దంతాలు పెట్టించుకున్నాడు. లైపోసక్షన్‌తో తన పొట్టను మడత పెట్టించుకుని, బొడ్డును పూర్తిగా తొలగించాడు. కోవిడ్-19 కంటే ముందే అతడు తన చెవులను తొలగించుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ, ఇలోగా వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో మాస్క్ పెట్టుకోవడం కోసం బుద్ధిగా చెవులను ఉంచుకున్నాడు. 


Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి


ఇక కోవిడ్ సమస్య లేదని, మాస్క్ తప్పనిసరి కాదని ప్రభుత్వం చెప్పడంతో చెవులను కత్తిరించుకున్నాడు. ప్రాడో ప్రయా గ్రాండేలో నివసిస్తున్నాడు. ఇంటర్నెట్‌లో అతన్ని 'డయాబ్లో' అని పిలుస్తారు. అంటే డెవిల్ అని అర్థం. ఇతడే కాదు, తన భార్య కూడా తేడానే. ఆమె కూడా శరీరానికి అనేక మార్పులు చేయించుకుంది. అందుకే నెటిజనులు ఆమెను  ‘ముల్హెర్ డెమోనియా’ లేదా ‘రాక్షస స్త్రీ’ అని అంటారు. మరి ప్రాడో చెవులను తొలగించుకోవడం మంచి నిర్ణయమేనా? దీనిపై మీ స్పందన ఏమిటీ?