ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత బలహీనమైన నాయకుడని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు. కేబినెట్‌లో చోటు దక్కలేదని సీఎం దిష్టిబొమ్మను, బైక్‌లను టైర్లను కాల్చుతూ సొంత పార్టీ నేతలుఆందోళనలు చేయటం మొదటి సారి చూశానన్నారు.  సామాజిక, ప్రాంత సమతుల్యత లేని కేబినెట్ అని గంటా తేల్చేశారు. రాజధాని అని ప్రచారం చేస్తున్నారు కానీ విశాఖకు మంత్రి పదవి లేకుండా చేశారన్నారు. విజయవాడకు, తిరుపతికి అలాగే 8 జిల్లాలకు మంత్రులు లేకుండా చేశారని ఇదేం సమీకరణమని గంటా ప్రశ్నించారు.  


రేషన్ బియ్యం వద్దా ? అయితే డబ్బులిస్తారు ! ఏపీలో కొత్త స్కీమ్


ఎన్నికలకి రెండేళ్ల ముందు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామంటే ప్రజలు ఎలా నమ్ముతారనిప్రశ్నించారు.  టీడీపీకి బీసీలు ఎప్పుడూ అ౦డగా ఉంటారన్నారు.   కొన్నింటి నుంచి డైవర్ట్ చేయడం కోసం అర్జెంట్ గా ఎటువంటి  కసరత్తు చేయకుండా జిల్లాల విభజన చేశారని.. దీనిపై కూడా సొంత పార్టీ నేతలు ధర్నాలు చేశారని గుర్తు చేశారు. సీఎం జగన్ నిర్ణయాలను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే స్వాగతించడం లేదన్నారు. త్వరలో టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి వస్తారని గంటా జోస్యం చెప్పారు. 


ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు- పల్లె వెలుగులో కనీస ఛార్జ్‌ రూ. 10


2019లో గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో మౌనం పాటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అసెంబ్లీకి కూడా హాజరు కావడం లేదు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో సభాపతి తమ్మినేని సీతారాంకు ఇచ్చారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఆయన పదే పదే కోరినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 


అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ స్థాపనకు సీఎం జగన్ కృషి : ఆర్కే రోజా


ఈ మధ్య కాలంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయన ప్రచారాన్ని ఆయన ఖండించలేదు.. అలాగని ఇతర పార్టీల్లోనూ చేరలేదు. చివరికి ఆయన టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆయన చెబుతున్నారు.