Ambedkar Jayanti : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని గురువారం అమరావతి సచివాలయంలోని తన ఛాంబరులో మంత్రి ఆర్కే రోజా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమ సమాజాన్ని స్థాపించేందుకు సీఎం జగన్  కృషి చేస్తున్నారన్నారు. అంబేడ్కర్ ఆశించిన బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థలో అన్ని విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యంగా మహిళలకు  సముచిత స్థానం కల్పించారన్నారు. నేడు సమాజంలోని అన్నికులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు కలసి మెలసి జీవించగలుగుతున్నారంటే అందుకు కారణం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమేనని అన్నారు. 


సమ సమాజ స్థాపనకు సీఎం కృషి


అందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో నడచినప్పుడే అంబేడ్కర్ కు నిజమైన నివాళులర్పించినవారు అవుతామని మంత్రి రోజా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేడ్కర్ నిజమైన వారసుడిలా సీఎం జగన్ అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అంబేద్కర్ కలలుగన్న సమాజ స్థాపనకు కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేడ్కర్ కీలకపాత్ర పోషించారని మంత్రి గుర్తు చేశారు. అంబేడ్కర్ ఆశయాలను తూ.చా తప్పకుండా పాటిస్తూ వారి అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ పాలనలో సరికొత్త అధ్యాయాలను సీఎం జగన్ లిఖించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ(సాప్)ఎండీ ప్రభాకర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


Also Read : కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద బాధితులకు హోంమంత్రి పరామర్శ, యజమాన్యానిది తప్పని తేలితే కఠిన చర్యలు


సీఎం జగన్ నివాళులు 


డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, పినెపే విశ్వరూప్‌, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్‌ పాల్గొన్నారు. రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్ అని సీఎం జగన్ అన్నారు. అణగారిన వర్గాలకు ఆశాదీపం అంబేడ్కర్ అని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ భావాలకు మరణంలేనివన్నారన్నారు. 100 ఏళ్లకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహానుభావుడు అంబేడ్కర్ అని గుర్తుచేసుకున్నారు. 


Also Read : AP Ration Rice : రేషన్ బియ్యం వద్దా ? అయితే డబ్బులిస్తారు ! ఏపీలో కొత్త స్కీమ్