Dumbbell In Rectum | ఓ వ్యక్తి కడుపు నొప్పిగా ఉందని వైద్యులను ఆశ్రయించాడు. గత కొద్ది రోజులుగా మల విసర్జన కూడా కావడం లేదని, వాంతులు అవుతున్నాయని వైద్యులకు చెప్పాడు. దీంతో సాధారణ కడుపు నొప్పని భావించి వైద్యులు మందులు రాసిచ్చారు. కానీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. పైగా తీవ్రత మరింత పెరిగింది. ఇక లాభం లేదని వైద్యులు అతడికి ఎక్స్-రే తీశారు. దాన్ని చూసిన తర్వాత వారి మాట రాలేదు. కడుపులో ఇంత బరువును దాచుకుని ఎందుకు చెప్పలేదయ్యా అన్నట్లు అతడి వైపు చూశారు. ఎందుకంటే, అతడి మల ద్వారంలో 2 కిలోల బరువైన డంబెల్ కనిపించింది.


ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. 54 ఏళ్ల వ్యక్తి లైంగిక కోరికలు తట్టుకోలేక వెనుక వైపు నుంచి 2 కిలోల బరువుండే డంబెల్‌ను చొప్పించుకున్నాడు. అయితే, గ్రిప్ కోల్పోవడంతో ఆ డంబెల్ నేరుగా మల ద్వారంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు చేతులతో దాన్ని బయటకు తీసేందుకు విఫలయత్నం చేశాడు. వైద్యులను ఆశ్రయించి.. తనకు వికారంగా ఉందని, విసర్జన చేయలేకపోతున్నా అని మాత్రమే చెప్పాడు. అసలు విషయం చెబితే పరువు పోతుందని భావించి.. తానే స్వయంగా ఆ డంబెల్‌ను బయటకు తీయాలని అనుకున్నాడు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాడు. 


మనౌస్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్లాడు. అసలు విషయం చెప్పకుండా నాన్చాడు. మల పరీక్షల్లో ఎలాంటి సమస్య తెలియరాలేదు. దీంతో వైద్యుడు ఎక్స్‌రే తీశారు. అతడి కడుపుకు దిగువన మల ద్వారం వద్ద 12 సెంటీ మీటర్లు పొడవు గల సన్నని డంబెల్ కనిపించింది. డంబెల్‌ను తొలగించడానికి వైద్యులు తొలుత బాధితుడికి మత్తు ఇచ్చారు. పట్టకార్లతో ఆ డంబెల్‌ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. చివరికి సర్జన్ తన చేతులను అతడి మలద్వారంలోకి చొప్పించి డంబెల్‌ను విజయవంతంగా బయటకు తీశాడు.  


ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్ రిపోర్ట్స్‌లో ఈ ఘటన గురించి వివరించారు. బాధితుడు చెప్పిన కారణాన్ని పరిశీలిస్తే.. ఇది లైంగిక ప్రక్రియగా తేలిందని తెలిపారు. ఇటీవల కోరికలను కంట్రోల్ చేసుకోలేనివారు వివిధ వస్తువులను తమ మర్మాంగాల్లోకి చొప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. బాధితుడికి మూడు రోజులపాటు చికిత్స అందించింది డిశ్చార్జ్ చేశారని తెలిపారు.


Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి


ఇటీవల ఓ మహిళ ఏకంగా గాజు గ్లాసును చొప్పించుకుని ఆస్పత్రిపాలైంది. యూకేలో ఎక్కువగా ఇలాంటి కేసులు తరచుగా నమోదవుతున్నట్లు అక్కడికి గణాంకాలు చెబుతున్నాయి. కామోద్రేకంతో కొందరు బీర్ సీసాలు, టూత్ బ్రష్‌లు, క్యారెట్‌లు, వైన్ కార్క్‌లు పెట్టుకుంటున్నారట. 2010 నుంచి 2019 మధ్య మొత్తం 3,500 వస్తువులు వెనుక భాగం నుంచి చొప్పించుకున్నారట. వాళ్లకు అదేం పాడుబుద్ధో ఏమో!!


Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..