Eggless Mayonnaise Making Process : మయోనైజ్ తెలంగాణలో ఎంత దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ యువతి చనిపోవడంతో ఈ మయోనైజ్ సంవత్సరం పాటు బ్యాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ మయోనైజన్ను ఇంట్లో కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. అయితే చాలామంది ఎగ్తోనే దీనిని చేస్తారనుకుంటారు. కానీ టేస్టీగా, హెల్తీగా ఉండే మయోనైజ్‌ను ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. మరి ఎగ్ లెస్ మయోనైజ్‌ను ఏవిధంగా ఇంట్లో చేసుకోవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ఎగ్‌లెస్ మయోనైజ్‌ను క్రీమీగా, ఫ్లేవర్ ఫుల్‌గా చేసుకోవాలనుకునేవారికోసమే ఈ రెసిపీ ఉంది. దీనిని వేగన్ డైట్ ఫాలో అయ్యేవారు.. వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా లాగించవచ్చు. మరి ఎగ్ లెస్ మయోనైజ్‌ను ఇంట్లో నోరూరించే విధంగా తయారు చేసుకుని.. సలాడ్స్‌లో ఎలా ఉపయోగించాలో.. శాండ్విచ్లకి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అంతా విషమేనా? మోమోలు, షవర్మాలు తినేవారు జాగ్రత్త.. ఆ ఒక్కటే కొంపముంచేస్తోందట
కావాల్సిన పదార్థాలు
ఆక్వాఫాబా - పావు కప్పు
వెజిటేబుల్ ఆయిల్ - 1 కప్పు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
యాపిల్ సైడర్ వెనిగర్ - 1 టేబుల్ స్పూన్
సాల్ట్ - రుచికి తగినంత
తయారీ విధానం
ఆక్వాఫాబా అంటే ఏంటో అనుకుంటున్నారా? కాబూలీ చనాను నానబెట్టిన లేదా ఉడకబెట్టిన నీటిని ఆక్వాఫాబా అంటారు. శనగలను కడిగి.. 4 లేదా 5 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన నీటిలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వాటితో చారు కూడా పెట్టుకుంటారు చాలామంది. అలాగే మయోనైజ్ చేయడానికి కూడా ఈ నీటిని ఉపయోగిస్తారు. ఆక్వాఫాబా అందుబాటులో లేకుంటే సిల్కాన్ టోఫును ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆవాలను పేస్ట్ చేసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ లేకుంటే నిమ్మరసం ఉపయోగించుకోవచ్చు.
ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో ఆక్వాఫాబా లేదా సిల్కన్ టోఫు తీసుకోవాలి. బ్లెండర్తో దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో మస్టర్డ్ పేస్ట్.. యాపిల్ సైడర్ వెనిగర్ లేదా నిమ్మరసం వేసి బాగా కలిసే వరకు బ్లెండ్ చేయాలి. పదార్థాలు అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎగ్ లేకుండా మయోనైజ్ చేసుకునే విధానం.
ఇప్పుడు దానిలో వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలి. ఈ క్రీమ్‌లో నూనె పూర్తిగా కలిసేవరకు బాగా కలపాలి. ఎమల్షన్ విడిపోతే మళ్లీ మొదటినుంచి చేసుకోవాలి. కాబట్టి నూనె ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ.. ఈ మయోనైజ్‌ను తయారు చేసుకోవాలి. మయోనైజ్ మీకు కావాల్సిన టెక్స్చర్ వచ్చిన తర్వాత దానిలో రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోవాలి. అంతే మయోనైజ్ రెడీ. మీరు ఫ్లేవర్స్ కోసం వెల్లుల్లి పౌడర్.. ఇతర హెర్బ్స్ వేసుకుని కలిపేయవచ్చు.
ఇలా తయారు చేసుకున్న మయోనైజ్‌ను శుభ్రం చేసిన డబ్బాలో వేసి.. గాలి లోపలికి వెళ్లకుండా గట్టిగా మూత పెట్టాలి. దీనిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అంతే టేస్టీ, ఎగ్‌లెస్ మయోజనైజ్ రెడీ. మీరు సలాడ్స్, శాండ్‌విచ్‌లలో దీనిని వేసుకుని రుచిని ఆస్వాదించవచ్చు.
Also Read : మయోనైజ్‌ను ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోండి.. ఏ లొల్లి లేకుండా హాయిగా తినేయండి